
ఏపి రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ కి ఆత్మీయ స్వాగతం పలికిన కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్
ఏపీ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా రాయలసీమ యూనివర్సిటీ నాలుగో స్నాతకోత్సవం, మాంటెస్సోరి పాఠశాల గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో పాల్గొనేందుకు కర్నూలు ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ కి విచ్చేసారు. ఈ సందర్భంగా బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ కి కర్నూల్ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేసి స్వాగతం పలికారు.




