
నేడు డయల్ యువర్ ఎపిఎస్పిడిసిఎల్ సిఎండి
తిరుపతి, నవంబరు 16, (సీమకిరణం న్యూస్) :
విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 17వతేదీన ఉదయం 10:00 గం||ల నుంచి మధ్యాహ్నం 12:00 గం||ల వరకు డయల్ యువర్ ఎపిఎస్పిడిసిఎల్ సిఎండి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆ సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే డయల్ యువర్ సిఎండి కార్యక్రమం ద్వారా తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల నుంచి వినియోగదారులు మొబైల్ నంబరు: 8977716661కు కాల్ చేసి తమ విద్యుత్ సమస్యలను సిఎండి దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు. వినియోగదారుల సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సదవకాశాన్ని విద్యుత్తు వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరొరు. ఈ కార్యక్రమం ద్వారానే కాకుండా వినియోగదారులు విద్యుత్ శాఖ టోల్ ఫ్రీ నంబర్లు: 1912 లేదా 1800 425 155333కు కాల్ చేయడం లేదా వాట్సాప్ నంబరు: 91333 31912కు చాట్ చేయడం ద్వారా కూడా విద్యుత్ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు.




