BREAKING NEWSCRIMEPOLITICSSPORTSSTATE
Trending

డిజిటల్ అరెస్ట్‌ అంటేనే మోసం ! జాగ్రత్త…

డిజిటల్ అరెస్ట్‌ అంటేనే మోసం ! జాగ్రత్త…

సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్

డిజిటల్ అరెస్ట్ అంటూ చట్టంలో ఎక్కడ లేదు

“పోలీసులు ఎప్పుడూ ఫోన్‌లో డబ్బులు అడగరు – ‘డిజిటల్ అరెస్ట్’ అన్నారంటే ఫోన్ కట్ చేయండి!”

“డిజిటల్ అరెస్ట్? అనేది పోలీసులది కాదు — సైబర్ మోసగాళ్ల కుట్ర!”

డిజిటల్ అరెస్టు పేరుతో వచ్చే కాల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

సైబర్ నేరగాళ్ళు చేసే మోసాలు అటువంటి వాటిని ఎవరు నమ్మవద్దు

ఇటీవల “డిజిటల్ అరెస్ట్” అనే పేరుతో సైబర్ మోసాలు ఎక్కువ అవుతున్నాయి… జాగ్రత్త…

సైబర్‌ నేరాల్లో సొమ్ము రికవరీకి అవకాశం గంటలోపే… అప్రమత్తతే కీలకం.

తెలియని వ్యక్తులకు బ్యాంకు ఖాతా ల ఒ.టి.పి.లను ఎవ్వరికీ చెప్పవద్దు.

కర్నూలు క్రైమ్, నవంబర్ 18, (సీమకిరణం న్యూస్):

డిజిటల్ అరెస్టు పేరుతో సైబర్ నేరగాళ్ళు పోలీసులమని , సీబీఐ అధికారులమని లేదా ఇతర ప్రభుత్వ అధికారులుగా నటిస్తూ వీడియో కాల్స్ చేస్తూ మీ మీద కేసు నమోదైందని, గంజాయి, డ్రగ్స్ కేసుల్లో ఇరుక్కున్నారని, మీరు అక్రమ కార్యకలాపాల్లో పాల్గొన్నారని, మీ పేరు మీద కోరియర్ వచ్చిందని అందులో డ్రగ్స్ ఉన్నాయని లేదా మీ సిమ్/బ్యాంక్ ఖాతా కు వాడబడిందని వచ్చే కాల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంగళవారం కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ విజ్ఞప్తి చేశారు.
పోలీసులు ఎప్పుడూ వీడియో, ఆడియో కాల్స్ చేయరన్న విషయం గ్రహించాలన్నారు.

ఎవరికీ కూడా వీడియో కాల్ ద్వారా అరెస్టు గురించి సమాచారం చెప్పడం పోలీసుల పని కాదన్నారు. .

అసలైన అధికారులు బ్యాంక్ ఖాతా / ఆధార్ / OTP అడగరన్నారు.

కేసులో సహాయం చేస్తామని, నమ్మించి, తాము సూచించిన బ్యాంకు ఖాతాకు భారీగా నగదు పంపాలని కోరుతారన్నారు. తమతో మాట్లాడిన వివరాలను ఎవ్వరికీ తెలపకుండా ఉండాలని తమ బ్యాంకు ఖాతాను రిజర్వు బ్యాంకు సహకారంతో పరిశీలించాల్సి ఉందని, వివరాలు సేకరించి, తమ యొక్క బ్యాంకు ఖాతాలలో ఉన్న డబ్బును కాజేస్తారన్నారు.

ఉదాహరణ 1:

కర్నూలు జిల్లా , ఆదోని పట్టణానికి చెందిన ఒక వ్యక్తి కి వీడియో కాల్ వచ్చింది. అతనికి కాల్ చేసిన ఒక వ్యక్తి తాను CBI అధికారిగా పరిచయం చేసుకొని మీ పేరు మీద డ్రగ్స్ కేసు నమోదైందని , భయభ్రాంతులకు గురిచేసి , కేసు పరిష్కారం కోసం వెంటనే వారి చెప్పిన బ్యాంకు ఖాతాలోకి రూ. 1 లక్ష 25 వేలు జమ చేయాలని తెలిపాడు. ఆ మాటలు నమ్మి డబ్బులు పంపి మోసపోయాడు.

ఉదాహరణ 2:

కర్నూలు పట్టణానికి చెందిన గృహిణి కి ఓ వ్యక్తి నుంచి కాల్ వచ్చింది . అతను పోలీసు అధికారి అని చెప్పి , మీ పేరు మీద బ్యాంక్ అకౌంట్ మిస్‌యూజ్ అయిందని ఆరోపించాడు.

ఆమెకు ఓ లింక్ పంపి, అందులో ఆధార్, బ్యాంక్ డీటెయిల్స్, ఓటీపీ ఇవ్వాలని చెప్పాడు. భయంతో ఆమె అన్ని వివరాలు ఇచ్చేసింది. కొన్ని నిమిషాల్లోనే ఆమె బ్యాంక్ ఖాతా నుండి రూ. 78 వేలు మోసపోయింది.

జిల్లా ఎస్పీ జిల్లా ప్రజలకు పలు సూచనలు చేశారు.

“వీడియో కాల్‌లో ‘అరెస్ట్‌ చేస్తాం’ అంటే నమ్మకండి – వెంటనే 1930 కు ఫిర్యాదు చేయండి.”

“మీ భయాన్ని ఆయుధంగా మార్చుకునే సైబర్ క్రిమినల్స్‌ పట్ల అప్రమత్తంగా ఉండండి!”

“పోలీసులు ఎప్పుడూ గూగుల్ పే/ఫోన్ పే ద్వారా జరిమానా వసూలు చేయరు.”

“అనుమానం వచ్చిన వెంటనే – Kurnool Cyber Police ను సంప్రదించండి.”

“తెలియని నంబర్లకు OTP, డబ్బులు, వ్యక్తిగత వివరాలు చెప్పొద్దు!”

“డిజిటల్ అరెస్ట్‌ బెదిరింపులు = 100% సైబర్ మోసం.”

” మోసగాళ్లకు అవకాశం ఇవ్వొద్దు!

ఎవరైనా తెలియని వ్యక్తులు కాల్ చేసి భయభ్రాంతులకు గురి చేస్తే అటువంటి ఫోన్ నెంబర్లను బ్లాక్ చేసి ఆ సమాచారాన్ని స్థానిక పోలీసు స్టేషన్ లోగాని లేదా సైబర్ ల్యాబ్ పోలీసులకు గాని సమాచారం అందించాలన్నారు.

ఈ తరహా నేరాల్లో ఎవరైనా నగదును పోగొట్టు కొన్నట్లయితే ఒక గంటలోపే 1930 కు లేదా నేషనల్ సైబరు క్రైం పోర్టల్లో https://cybercrime.gov.in/ కు రిపోర్టు చేయాలన్నారు.

సైబర్ నేరం జరిగిన గంటలోపే ఫిర్యాదు చేస్తే సైబర్ నేరగాళ్లు దోచుకున్న సొమ్మునంతా తిరిగి రికవరీ చేసి ఇప్పించేందుకు పోలీసులకు అవకాశం ఉంటుందని, గంటలోపే అప్రమత్తతే కీలకమని దాన్ని గోల్డెన్ అవర్ అని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Seema Kiranam

SEEMA KIRANAM TELUGU DAILY NEWS...RNI REGISTRATION NUMBER...RNI : APTEL/2018/76380.... S.K. NAZEER.FOUNDER , EDITOR & PUBLISHER.SK PUBLICATIONS & MEDIA BROADCASTING INDIA PVT LTD.SEEMA KIRANAM TELUGU DIGITAL | KURNOOL | SK DIGITAL MEDIA |Telugu News | Latest News Online | Political News in Telugu | AndhraPradesh Latest News | AP Political News | Telangana News | TelanganaPolitics News | Crime News | Sports News |

Seema Kiranam

SEEMA KIRANAM TELUGU DAILY NEWS...RNI REGISTRATION NUMBER...RNI : APTEL/2018/76380.... S.K. NAZEER.FOUNDER , EDITOR & PUBLISHER.SK PUBLICATIONS & MEDIA BROADCASTING INDIA PVT LTD.SEEMA KIRANAM TELUGU DIGITAL | KURNOOL | SK DIGITAL MEDIA |Telugu News | Latest News Online | Political News in Telugu | AndhraPradesh Latest News | AP Political News | Telangana News | TelanganaPolitics News | Crime News | Sports News |

Related Articles

Back to top button
error: Content is protected !!