పోలీసు స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

కె. నాగలాపురం పోలీసు స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
పోలీసు స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్
కర్నూలు క్రైమ్, నవంబర్ 21, (సీమకిరణం న్యూస్):
కె. నాగలాపురం పోలీసు స్టేషన్ ను కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ శుక్ర వారం వార్షిక తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసుల్లో పెండింగ్ కేసులు వాటి స్థితిగతులు, నిందితుల అరెస్టు, కేసుల దర్యాప్తులు, వాటి పురోగతి పై కేసుల ఫైళ్ళను క్షుణ్ణంగా పరిశీలించారు. రోడ్డు ప్రమాదాల నివారణ చర్యల గురించి ఆరా తీశారు. డ్రంకెన్ డ్రైవ్, ఒపెన్ డ్రింకింగ్ లపై ప్రత్యేక దృష్టి సారించి తనిఖీలు చేపట్టాలన్నారు. కేసులు నమోదుచేసి శిక్షలు పడేవిధంగా చేయాలన్నారు.
ప్రాపర్టీ కేసులను చేధించి రికవరీలు చేయాలన్నారు.
విజిబుల్ పోలీసింగ్ చేయాలన్నారు. బాధితులు పోలీసుస్టేషన్ ను ఆశ్రయించినప్పుడు వారి సమస్యలకు పరిష్కారం చూపాలన్నారు. పోలీసు స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.
సైబర్ నేరాలపై, మహిళల చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం కె .నాగలాపురంలోని శ్రీ సుంకులమ్మ పరమేశ్వరి అమ్మవారిని జిల్లా ఎస్పీ దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. జిల్లా ఎస్పీ గారితో పాటు కర్నూలు డిఎస్పీ జె. బాబు ప్రసాద్ , డిసిఆర్ బి సిఐ గుణశేఖర్ బాబు, కర్నూలు రూరల్ సిఐ చంద్రబాబు నాయుడు, కె. నాగలాపురం ఎస్సై శరత్ కుమార్ రెడ్డి ఉన్నారు.




