
జర్నలిస్టుల గౌరవార్థం దేవాలయాలలో దర్శన సౌకర్యానికి ఉచిత ప్రత్యేక పాసులు మంజూరు చేయాలి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి వినతిపత్రం అందజేసిన నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (NARA)
అమరావతి, నవంబరు 28, (సీమకిరణం న్యూస్):
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు నిష్పక్షపాతంగా, నిజాయితీగా సమాచారం అందించి ప్రజాస్వామ్య వ్యవస్థకు బలాన్నిచ్చే పనిచేసే జర్నలిస్టుల గౌరవార్థం, ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న దేవాలయాలలో దర్శన సౌకర్యానికి ప్రత్యేక పాసులు మంజూరు చేయవలసిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కి నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (NARA) వినతి పత్రం అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా రోజూవారీగా ప్రభుత్వ కార్యక్రమాలు, సామాజిక సమస్యలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, మరియు అత్యవసర పరిస్థితుల్లో నిరంతరం విధుల్లో నిమగ్నమై ఉండే జర్నలిస్టులు, పండుగలు, బ్రహ్మోత్సవాలు, ప్రత్యేక దర్శనాలు మొదలైన సందర్భాలలో ప్రజల రద్దీ కారణంగా దేవాలయ దర్శనానికి అవకాశం కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో, ప్రభుత్వం గుర్తించిన, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాలలో వార్షిక ఉచిత దర్శన పాసులు జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా మంజూరు చేయవలసిందిగా మంత్రిని కోరారు. ఆమోదిత మీడియా సంస్థలకు చెందిన వర్కింగ్ జర్నలిస్టులు, వారి ఐడెంటిటీ ఆధారంగా, పండుగలు మరియు సాధారణ రోజులలో దర్శనం పొందే విధంగా సౌకర్యం కల్పించవచ్చు. దీనివల్ల రాష్ట్ర దేవాలయాల ప్రచారం, సేవలు, కార్యక్రమాలు ప్రజలకు మరింత సమర్థవంతంగా చేరటమే కాకుండా మీడియా వర్గాలకు ప్రభుత్వం అందించే గౌరవ సూచకమైన సహకారం అవుతుందని మంత్రికి తెలియజేశారు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వం గుర్తించిన అన్ని దేవాలయాలలో జర్నలిస్టులకు ఉచిత దర్శన పాసులు మంజూరు చేయవలసిందిగా మంత్రిని కోరారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ సమాచార సేకరించి వివరాలు సేకరించి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (NARA) ఫౌండర్ ప్రెసెంట్ డాక్టర్ బండి సురేంద్రబాబు తో పాటు ఎడిటర్లు పాల్గొన్నారు..




