
భూపతిరాజు సూర్యనారాయణ రాజు చిత్రపటానికి నివాళులర్పించిన జర్నలిస్టు నాయకులు డాక్టర్ సురేంద్ర బాబు
కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజుని పరామర్శించిన నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (NARA) నాయకులు
భీమవరం, నవంబర్ 29, (సీమకిరణం న్యూస్):
కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తండ్రి భూపతిరాజు సూర్యనారాయణ రాజు కాలం చేశారు. కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతూ హైదారాబాద్‌లోని పైవ్రేటు ఆసుపత్రిలో గురువారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ డాక్టర్ బండి సురేంద్రబాబు గురువారం భీమవరంలో మంత్రి స్వగృహంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పరామర్శించి వారి తండ్రి భూపతిరాజు సూర్యనారాయణ రాజు చిత్రపటానికి నివాళులు అర్పించారు. నివాళులర్పించిన వారిలో నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ డాక్టర్ బండి సురేంద్రబాబు, గడ్డం నాగరాజు, ప్రకాష్, శ్రీనివాసరావు, అంజి ఉన్నారు..




