ANDHRABREAKING NEWSCRIMEPOLITICSSPORTS
మంత్రి కొలుసు పార్థసారథి ఆధ్వర్యంలో గుర్తింపు పొందిన జర్నలిస్టు సంఘాల నాయకులతో సమావేశం

సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఆధ్వర్యంలో గుర్తింపు పొందిన జర్నలిస్టు సంఘాల నాయకులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (NARA) నాయకులు
అమరావతి, నవంబరు 29, (సీమకిరణం న్యూస్)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, రాష్ట్ర సమాచార శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్ల ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఐదో బ్లాక్ లో గుర్తింపు పొందిన జర్నలిస్టు యూనియన్ లతో నూతన అక్రిడేషన్ విధానాన్ని ఎలా అమలు చేయాలనే అంశంపై సమావేశం నిర్వహించారు.. ఈ సమావేశంలో నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (NARA) ఫౌండర్ & నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ బండి సురేంద్రబాబు, నేషనల్ జనరల్ సెక్రెటరీ మద్దినేని మానస, నేషనల్ సెక్రెటరీ వీరమాచినేని సూర్య ప్రకాష్ చౌదరి, అంజి, నవీన్ పాల్గొన్నారు..




