ANDHRABREAKING NEWSCRIMEPOLITICSSPORTSSTATETELANGANAWORLD

మంత్రి బిసి. జనార్ధనరెడ్డి కి వినతి పత్రం సమర్పించిన బండి సురేంద్రబాబు

ఎంపానెల్‌మెంట్‌ ను అక్రిడిటేషన్ కు అడ్డంకిగా మార్చిన వాటిపై అత్యవసర పునఃపరిశీలన చేసి సవరించాలి

 

జర్నలిస్టుల అక్రిడిటేషన్ వ్యవస్థలో జర్ణలిస్టులకు ఏర్పడిన అన్యాయాలు, కొత్త షరతుల వల్ల ఏర్పడిన తీవ్రమైన సమస్యలు, ఎంపానెల్‌మెంట్‌ను అక్రిడిటేషన్ కు అడ్డంకిగా మార్చిన వాటిపై అత్యవసర పునఃపరిశీలన మరియు సవరించిన మార్గదర్శకాలు జారీ చేయవలసిన అవసరం గురించి – నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (NARA) తరపున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బిసి. జనార్ధనరెడ్డి కి వినతి పత్రం

 

అమరావతి, నవంబరు 29, (సీమకిరణం న్యూస్):

జర్నలిస్టుల అక్రిడిటేషన్ వ్యవస్థలో జర్ణలిస్టులకు ఏర్పడిన అన్యాయాలు, కొత్త షరతుల వల్ల ఏర్పడిన తీవ్రమైన సమస్యలు, ఎంపానెల్‌మెంట్‌ను అక్రిడిటేషన్ కు అడ్డంకిగా మార్చిన వాటిపై అత్యవసర పునఃపరిశీలన చేసి సవరించి మార్గదర్శకాలు జారీ చేయాలని నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (NARA) ఫౌండర్ మరియు నేషనల్ ప్రెసిడెంట్ ఆఫ్ బండి సురేంద్రబాబు ఆధ్వర్యంలో స్మాల్ న్యూస్ పేపర్స్ ఎడిటర్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సెక్రటేరియట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బిసి. జనార్ధనరెడ్డి కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బండి సురేంద్రబాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల అక్రిడిటేషన్ విధానంలో చోటు చేసుకుంటున్న మార్పులు, ముఖ్యంగా ఎంపానెల్‌మెంట్ లేకపోతే అక్రిడేషన్ ఇవ్వలేమని ఐ&పీఆర్ శాఖ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల చిన్న పత్రికలు మరియు వేలాది జర్నలిస్టులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.. కమిషనర్ గారు ఈ సమస్యపై దృష్టి పెట్టాలని కోరుతున్నాము.. ఈ సమస్య కేవలం ఒక వృత్తి సమస్య కాదు. ఇది ప్రజాస్వామ్యానికి శ్వాస లాంటి మీడియా రంగం బలహీనపడే ప్రమాదానికి సంకేతం అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 600 చిన్న పత్రికలకు కేవలం “ఎంపానెల్ లేదు” అనే ఒక్క కారణంతో అక్రిడేషన్ నిరాకరణ జరుగుతోంది. ఈ చిన్న పత్రికలలో పనిచేసే రిపోర్టర్లు నెలకు 4,000–8,000 సంపాదన, బయట అడ్వర్టైజ్ ఆదాయం లేదు, ప్రింటింగ్ ఖర్చులు తీరని పరిస్థితి, భద్రత లేకుండా ప్రమాదాల మధ్య పనిచేయడం. అలాంటి పరిస్థితిలో అక్రిడేషన్ అనేది వారి గౌరవం—వారి హక్కు- వారి వృత్తికి గుర్తింపు మాత్రమే. ప్రభుత్వానికి అటువంటి అక్రిడేషన్‌ల వల్ల ఏ ఆర్థిక భారం లేదు, అయినా అక్రిడేషన్‌ను ఆయుధంలా ఉపయోగించడం బాధాకరమన్నారు.. ప్రభుత్వ ప్రకటనలకు ఎంపానెల్‌మెంట్ అవసరం నిజమే. కానీ— ఏ జీవోలోనూ, ఏ కేంద్ర మార్గదర్శకాలలోనూ “ఎంపానెల్ లేకుంటే అక్రిడేషన్ ఇవ్వలేదు” అనే నిబంధన లేదు. ఇది పూర్తిగా కొత్తగా అధికారులు సృష్టించిన నియమం గతంలో ఎప్పుడూ లేని, చట్టపరమైన ఆధారం లేని, అమాయక జర్నలిస్టులపై భారంగా మారిన అన్యాయమన్నారు.. గతంలో స్టేట్ హెడ్‌క్వార్టర్స్ అక్రిడేషన్ కోసం రెగ్యులారిటీ, సర్క్యులేషన్, రిజిస్ట్రేషన్, ఈ-ఫైలింగ్ & ఆడిట్ రిపోర్ట్స్ చూసి అక్రిడేషన్లు జారీ చేసేవారు. ఇవేవీ ఇప్పుడు పరిశీలనలో లేవు. “ఎంపానెల్ లేదు కాబట్టి అక్రిడేషన్ లేదు” అని చెప్పడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. జర్నలిస్టులకు భూములు రావు, సబ్సిడీలు రావు, స్టేట్ లెవెల్ లో బస్సు పాస్ లేదు, రైల్వే పాస్ లేదు, రిస్క్ ఇన్సూరెన్స్ లేదు. అయినా అక్రిడేషన్‌పై ఇంత కఠినత ఎందుకు? ఇది జర్నలిస్టుల వృత్తిపైనే దాడి అన్నారు.. చిన్న పత్రికలే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజాస్వామ్యానికి నిజమైన స్వరం. వీటిని మూయించినా, అణచినా—ప్రజాస్వామ్యం బలహీనపడుతుంది, ప్రజల సమస్యలు వెలుగులోకి రావు అన్నారు.  ఎంపానెల్‌మెంట్‌ను అక్రిడేషన్ షరతుగా వెంటనే తొలగించాలి. సెంట్రల్ గైడ్‌లైన్స్, పాత జీవోల ప్రకారం అక్రిడేషన్ ప్రక్రియను అమలు చేయాలి. అక్రిడేషన్‌కు స్పష్టమైన, పారదర్శకమైన, రాతపూర్వక మార్గదర్శకాలు జారీ చేయాలి. కొత్త వెబ్సైట్‌లో ఉన్న సాంకేతిక లోపాలను తక్షణమే సరిచేయాలి. జిల్లా & రాష్ట్ర సమాచార అధికారులకు స్పష్టమైన అవగాహన కల్పించాలి. చిన్న పత్రికల రక్షణకు ప్రత్యేక పాలసీ రూపొందించాలి. గ్రామీణ మీడియాను బలోపేతం చేయడం ప్రభుత్వ బాధ్యత. ఇప్పటికే ఉన్న స్టైట్ హెడ్ క్వార్టర్స్ అక్రిడేషన్‌లను తిరస్కరించకుండా కొనసాగించాలనీ సురేంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో “వార్తా ప్రపంచం” చీఫ్ ఎడిటర్ బండి సురేంద్రబాబు,”విజయ సారధి” న్యూస్ ఎడిటర్ సిరివెళ్ల నాగరాజు, “నేటి శంఖారావం” న్యూస్ ఎడిటర్ గౌరీ, న్యూస్ ఫ్రెండ్ ఎడిటర్ పాల్గొన్నారు…

Seema Kiranam

SEEMA KIRANAM TELUGU DAILY NEWS...RNI REGISTRATION NUMBER...RNI : APTEL/2018/76380.... S.K. NAZEER.FOUNDER , EDITOR & PUBLISHER.SK PUBLICATIONS & MEDIA BROADCASTING INDIA PVT LTD.SEEMA KIRANAM TELUGU DIGITAL | KURNOOL | SK DIGITAL MEDIA |Telugu News | Latest News Online | Political News in Telugu | AndhraPradesh Latest News | AP Political News | Telangana News | TelanganaPolitics News | Crime News | Sports News |

Seema Kiranam

SEEMA KIRANAM TELUGU DAILY NEWS...RNI REGISTRATION NUMBER...RNI : APTEL/2018/76380.... S.K. NAZEER.FOUNDER , EDITOR & PUBLISHER.SK PUBLICATIONS & MEDIA BROADCASTING INDIA PVT LTD.SEEMA KIRANAM TELUGU DIGITAL | KURNOOL | SK DIGITAL MEDIA |Telugu News | Latest News Online | Political News in Telugu | AndhraPradesh Latest News | AP Political News | Telangana News | TelanganaPolitics News | Crime News | Sports News |

Related Articles

Back to top button
error: Content is protected !!