
విలేకరుల ఆత్మగౌరవంతో చెలగాటం ఆడుతున్న ప్రభుత్వాలు
ఒకటి, రెండు అక్రిడిటేషన్ లతో తో పత్రిక ను నడపడమంటే అది పత్రిక కాదు.. కరపత్రం అనుకోవాలి
ప్రభుత్వాలు కరపత్రాన్ని ముద్రించడానికి ప్రోత్సహిస్తున్నట్లు గా వున్నది
నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ బండి సురేంద్ర బాబు
అమరావతి, నవంబరు 29, (సీమకిరణం న్యూస్):
విలేకరుల ఆత్మగౌరవం అయిన అక్రిడిటేషన్ విషయంలో ప్రభుత్వాలు చిన్న పత్రికలలోని విలేకరుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు.. తీవ్ర అన్యాయం జరుగుతుంది… చిన్న పత్రికల పరిస్థితి కాళ్లు విరిచి పరిగెత్తమన్నట్లు గా వున్నది. పత్రికలు నడవాలంటే విలేకరులు మూలం. విలేకర్లుగా పని చేయాలంటే పత్రికకు అక్రిడిటేషన్లు అవసరం. అక్రిడిటేషన్ లేకుండా ఏ విలేకరి పని చేయడు. ఒకటి, రెండు అక్రిడిటేషన్ కార్డుల తో పత్రికను నడపడం పెద్ద జోక్ గా చెప్పాలి. అలా నడపాలంటే అది పత్రిక కాదు… కరపత్రం అని చెప్పాలి. కరపత్రం అనేది ఒక్కడే తయారుచేస్తారు. ప్రభుత్వం కరపత్రాన్ని తయారు చేయడానికి ప్రోత్సహిస్తుందని చెప్పాలి. చిన్న పత్రికలకు అక్రిడిటేషన్లు అనేది అవసరం. చిన్న పత్రిక విలేకరి బీదవాడు. స్వేచ్ఛగా ఆత్మగౌరవం కోసం చిన్న పత్రికల్లో పని చేయడానికి ఇష్ట పడతాడు.ఇది నిజామా? కాదా?
రాజకీయ పార్టీలే పత్రికలూ నడుపుతాయి అనుకుంటే డా.అంబేద్కర్ లాంటి వారు రాజ్యాంగం లో పత్రిక స్వేచ్ఛకు స్థానం లేకుండా చేసేవారు. కొన్ని సంఘాల ప్రతినిధులు అక్రిడిటేషన్ కార్డుల పెంపును ఇష్టపడడం లేదంటే వారికి జర్నలిస్టుల ఆత్మగౌరంకాని, సంక్షేమం కాని ఇష్టం లేనట్లు వున్నది. వారు ధనవంతులయిన ఉండొచ్చు. కరపత్రాల తయారిదారులయిన కావచ్చు. ఇది వారె ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఇప్పటికైనా జర్నలిస్టులు, జర్నలిస్ట్ సంఘాలు కళ్ళు తెరిచి ఐకమత్యంతో ముందుకు నడచి చిన్న పత్రికల విలేకరులకు, విలేకరులందరకు అక్రిడిటేషనలు సాధించేవారకు పోరాడాల్సిన భాద్యత మన అందరిది.. జర్నలిస్టుల సంక్షేమం కోసం N A R A అన్ని జర్నలిస్టుల సంఘాలతో కలిసి నడవడానికి మేము సిద్ధంగా ఉన్నామని బహిరంగంగా ప్రకటిస్తున్నాము.
🌹🌹🌹🌹🌹..
*డాక్టర్ బండి సురేంద్ర బాబు..*
*ఫౌండర్ మరియు నేషనల్ ప్రెసిడెంట్..*
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*నేషనల్ యాక్టీవ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (NARA)**🌹




