ANDHRACRIMEPOLITICSSPORTSSTATETELANGANAWORLD

ఆర్బీఐ పాలసీ ఎఫెక్ట్

ఆర్బీఐ పాలసీ ఎఫెక్ట్ : స్వల్పంగా తగ్గిన బంగారం.. కోలుకున్న రూపాయి

ఆర్బీఐ ద్రవ్య విధాన సమీక్ష నేపథ్యంలో స్వల్పంగా తగ్గిన బంగారం ధర

ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల పసిడి రూ. 1,29,892 వద్ద ట్రేడింగ్

డాలర్‌తో పోలిస్తే 9 పైసలు బలపడి 89.80 వద్దకు చేరిన రూపాయి

భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ద్రవ్య విధాన ప్రకటన వెలువడనున్న నేపథ్యంలో శుక్రవారం ఉదయం ట్రేడింగ్‌లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. అయితే, బలహీనపడిన అమెరికా డాలర్, స్పాట్ మార్కెట్‌లో నిలకడగా ఉన్న డిమాండ్ కారణంగా పసిడి ధరల పతనం పరిమితంగానే ఉంది. మరోవైపు భారత రూపాయి విలువ కోలుకుంది.

శుక్రవారం ఉదయం మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ 0.14 శాతం తగ్గి 10 గ్రాములకు రూ. 1,29,892 వద్ద ట్రేడవుతోంది. అదే సమయంలో మార్చి సిల్వర్ కాంట్రాక్టులు 0.74 శాతం పెరిగి కేజీకి రూ. 1,79,461 పలికాయి. ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశంపై ఇన్వెస్టర్లు దృష్టి సారించారు. ఇటీవల వెలువడిన స్థూల ఆర్థిక గణాంకాలు మిశ్రమంగా ఉండటంతో కేంద్ర బ్యాంకు వడ్డీ రేట్లను తగ్గిస్తుందా? లేక యథాతథంగా ఉంచుతుందా? అనే దానిపై నిపుణుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అంతర్జాతీయంగా ఈరోజు వెలువడనున్న అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాల కోసం ఇన్వెస్టర్లు ఎదురుచూస్తున్నారు. ఈ డేటా ఆధారంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ తదుపరి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

పుంజుకున్న రూపాయి
ఇక, కరెన్సీ మార్కెట్‌లో తీవ్ర ఒడుదొడుకుల తర్వాత రూపాయి విలువ పుంజుకుంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 9 పైసలు బలపడి 89.80 వద్ద ప్రారంభమైంది. గురువారం కూడా రూపాయి 26 పైసలు బలపడి 89.89 వద్ద ముగిసింది. అంతకుముందు బుధవారం విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ, ముడిచమురు ధరల పెరుగుదల వంటి కారణాలతో రూపాయి తొలిసారిగా 90 మార్కును దాటి 90.15 వద్ద ఆల్-టైమ్ కనిష్ఠ‌ స్థాయికి పడిపోయిన విషయం తెలిసిందే.

Seema Kiranam

SEEMA KIRANAM TELUGU DAILY NEWS...RNI REGISTRATION NUMBER...RNI : APTEL/2018/76380.... S.K. NAZEER.FOUNDER , EDITOR & PUBLISHER.SK PUBLICATIONS & MEDIA BROADCASTING INDIA PVT LTD.SEEMA KIRANAM TELUGU DIGITAL | KURNOOL | SK DIGITAL MEDIA |Telugu News | Latest News Online | Political News in Telugu | AndhraPradesh Latest News | AP Political News | Telangana News | TelanganaPolitics News | Crime News | Sports News |

Related Articles

Back to top button
error: Content is protected !!