
సివిల్ సప్లై అధికారులపై చర్యలు తీసుకోవాలి
వెల్దుర్తి ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ పై చర్యలు తీసుకోవాలి
సిపిఐ వెల్దుర్తి మండల కార్యదర్శి టి కృష్ణ
ఇండియన్ గ్యాస్ ఏజెన్సీపై చర్యలు తీసుకునేందుకు వెనుకడుగు వేస్తున్న మండల అధికారులు, జిల్లా అధికారులు : సిపిఐ
గ్యాస్ ప్రమాదంలో గాయపడిన మరణించిన వారికి నష్టపరిహారం ఇప్పించండి : సిపిఐ
కర్నూలు ప్రతినిధి, డిసెంబర్ 08, (సీమకిరణం న్యూస్):
రేషన్ బియ్యం సివిల్ సప్లై నుండి ప్రభుత్వం నిర్ణయించిన లారీలలో బియ్యం తరలించకుండా ఇష్టరాజ్యంగా ట్రాక్టర్లతో తరలిస్తుంటే అధికారులకు తెలిపిన పట్టించుకోని అధికారులపై చర్యలు తీసుకోవాలని సిపిఐ వెల్దుర్తి మండల కార్యదర్శి టి కృష్ణ పేర్కొన్నారు. బుక్కాపురం, లింగాలపల్లె గ్రామాలలో M/S ఇన్ఫినిటీ కంపెనీకి సిలిక మైనింగ్ కొరకు రైతుల అభిప్రాయ సేకరణ సరియైన పద్ధతిలో చేయకుండా భూమి ఇవ్వాలని రైతులకు నష్టపరిచే విధానాలను ప్రభుత్వం తలపెడుతుందని వాటిని వెంటనే రద్దు చేయాలన్నారు. అలాగే వెల్దుర్తిలో ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ వినియోగదారుల నుండి ఇష్టరాజ్యంగా అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని గ్యాస్ ప్రమాదంలో గాయపడిన, మరణించిన వారికి నష్టపరిహారం చెల్లించలేదన్నారు. ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ పై చర్యలు తీసుకునేందుకు మండలాధికారులతో పాటు జిల్లా అధికారులు ఎందుకు వెనుకడుగు వేస్తున్నారన్నారో అర్థం కావడం కాలేదన్నారు. మండలంలో జరిగే అవినీతిని మండల అధికారులకు తెలియజేసిన పట్టించుకోవడం లేదన్నారు. అలాంటి మండల అధికారులపై, అలాగే జిల్లా ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సిరి గారిని కోరారు. సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేశారు. సమస్యలను పరిష్కరించలేని పక్షంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో దశలవారీగా ఉద్యమాలు చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సహాయ కార్యదర్శి చిన్నమాదులు డి రాజు బుక్కాపురం లింగాలపల్లె రైతులు సుబ్బ రెడ్డి. ఎల్లారెడ్డి. మారెన్న.తదితరులు పాల్గొన్నారు.




