పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన జిల్లా కలెక్టర్, జేసీ
ఆంధ్ర రాష్ట్రం కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం నేటి తరానికి ఆదర్శం…
ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేద్దాం :-
కర్నూలు జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు
కర్నూలు కలెక్టరేట్, మార్చి 16,( సీమకిరణం న్యూస్) :
ఆంధ్ర రాష్ట్రం కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం నేటి తరానికి ఆదర్శం కావాలని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కూడా కృషి చేద్దాంమని జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు అన్నారు. బుధవారం కలెక్టర్‌రేట్‌లోని సమావేశం మందిరంలో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు, జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) ఎం.కె.వి శ్రీనివాసులు, పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం ఎనలేనిది, ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కు పొట్టి శ్రీరాములు చేసిన కృషి చిరస్మరణీయం అని జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు కొనియాడారు.తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం తెలుగు ప్రజలు ఒక రాష్ట్రంగా ఉండాలని ఆంధ్ర రాష్ట్ర సాధనకు 58 రోజులు ఆమరణ నిరాహార దీక్షతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సాధించిన మహానుభావులు పొట్టి శ్రీరాములు అన్నారు. ఆయన చేసిన త్యాగం, పోరాటం నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు చిత్రపటానికి డి ఆర్ ఓ పుల్లయ్య, జడ్పీ సీఈఓ వెంకటసుబ్బయ్య, డిఆర్డిఎ పిడి వెంకటేశులు, డ్వామా పిడి అమరనాథ రెడ్డి, డి పి ఓ నాగరాజు నాయుడు, సర్వ శిక్ష అభియాన్ పిఓ డాక్టర్ వేణుగోపాల్, డీఈఓ రంగారెడ్డి, జిల్లా అధికారులు, తదితరులు పూలమాలవేసి నివాళులర్పించారు.