
థ్రెడ్ ఆర్ట్ లో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు చిత్రపటం
15 రోజులు శ్రమించి రూపొందించిన యువకులు
అభినందించిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు
ఆత్రేయపురం మండలం ఉచ్చిలి గ్రామానికి చెందిన పలువురు యువకులు థ్రెడ్ ఆర్ట్ లో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు చిత్రపటాన్ని రూపొందించి ఆయనకు వాడపాలెం ఎమ్మెల్యే గారి కార్యాలయం వద్ద బహూకరించారు. థ్రెడ్ ఆర్ట్ ను యూట్యూబ్ లో చూసి నేర్చుకుని ఈ చిత్రాన్ని రూపొందించినట్లు వారు తెలిపారు. ఎమ్మెల్యే బండారు కొత్తపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని, అందుకు అభిమానంతో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు వారు తెలిపారు. ఈ థ్రెడ్ ఆర్ట్ ను ఆయన ఎంతగానో మెచ్చుకున్నారని యువకులు తెలిపారు. యూట్యూబ్ లో నేర్చుకునే ఇంత అద్భుతంగా రూపొందించడాన్ని ప్రశంసిస్తూ ఎమ్మెల్యే యువకులను అభినందించారు. ఈ ఆర్ట్ కు మరింత ప్రోత్సాహం అందిస్తానని ఎమ్మెల్యే తెలిపారు. యువకులను బహుమతిని అందజేశారు.




