ఆంధ్రుల గుర్తింపు కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహానభావుడు అమరజీవి
ఆంధ్రుల గుర్తింపు కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహానభావుడు అమరజీవి
కర్నూలు ఆర్డీఓ పరిపాల అధికారి ఎస్. రామానుజమ్మ
అమరజీవి పొట్టిశ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన పరిపాలన అధికారి ఎస్. రామానుజమ్మ
కర్నూలు కలెక్టరేట్, మార్చి 16, ( సీమకిరణం న్యూస్) :
ఆంధ్రుల గుర్తింపు కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహానభావుడు అమరజీవి అని ఆర్డీఓ కార్యాలయం పరిపాలన అధికారి ఎస్. రామానుజమ్మ కొనియాడారు. బుధవారం నాడు కర్నూలు ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ సి. హరిప్రసాద్ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రం కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం నేటి తరానికి ఆదర్శం కావాలని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కూడా కృషి చేద్దామని అన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం ఎనలేనిది, ఆంధ్రరాష్ట్ర ఏర్పాటుకు పొట్టిశ్రీరాములు చేసిన కృషి చిరస్మరణీయం అని ఆమె కొనియాడారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం తెలుగు ప్రజలు ఒక రాష్ట్రంగా ఉండాలని ఆంధ్ర రాష్ట్ర సాధనకు 58 రోజులు ఆమరణ నిరాహార దీక్షతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సాధించిన మహానుభావులు పొట్టి శ్రీరాములు అన్నారు. ఆయన చేసిన త్యాగం, పోరాటం నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు చిత్రపటానికి డి టీ లు రామాంజనేయులు, అరుణ, డివైఫ్ఓ గంగన్న, సీనియర్ అసిస్టెంట్ రాజేష్, జూనియర్ అసిస్టెంట్లు ఎస్. సరా అఫ్రిన్, ఎస్. మంజుల, సిబ్బంది అన్వర్, నూర్ తదితరులు పూలమాలవేసి నివాళులర్పించారు.