విద్యకు .. పేదరికం అడ్డు కాకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యం
విద్యకు .. పేదరికం అడ్డు కాకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యం
జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు
ప్రతి పేద విద్యార్థి ఉన్నత చదువే సీఎం లక్ష్యం –
జెడ్పీ ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, కర్నూలు నగర మేయర్ బి.వై రామయ్య :-
జగనన్న విద్య దీవెన కింద అక్టోబర్ – డిసెంబర్, 2021 త్రైమాసికానికి సంబంధించి లబ్ది మొత్తాన్ని విడుదల చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి :-
జిల్లాలో జగనన్న విద్యా దీవెన కింద అక్టోబర్ – డిసెంబర్, 2021 త్రైమాసికానికి సంబంధించి 88,055 మంది విద్యార్థులకు గాను అర్హులైన 78,631 మంది తల్లుల ఖాతాలలో రూ.51.99 కోట్లు జమ :-
కర్నూలు కలెక్టరేట్, మార్చి 16,( సీమకిరణం న్యూస్) :
విద్యకు పేదరికం ఏ మాత్రం అడ్డుకాకూడదన్నదే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు అన్నారు. బుధవారం సచివాలయం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అక్టోబర్ – డిసెంబర్, 2021 త్రైమాసికానికి సంబంధించి జగనన్న విద్యా దీవెన లబ్ధి మొత్తాన్ని నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు. ఈ కార్యక్రమానికి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు, జెడ్పీ ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, కర్నూలు నగర మేయర్ బి.వై రామయ్య, డిప్యూటీ మేయర్ సిద్దారెడ్డి రేణుక, జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) శ్రీనువాసులు, సోషల్ వెల్ఫేర్ డిడి ప్రతాప్ సూర్య నారాయణ రెడ్డి, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ వెంకట లక్ష్మమ్మ, మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ మహబూబ్ బాషా, గిరిజన సంక్షేమ శాఖ డిటీడబ్ల్యూఓ, డి ఎస్ డబ్ల్యుఓ చింతామణి, విద్యార్థుల తల్లులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…. పేద విద్యార్థులకు ఫీజు కష్టాలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన పథకాన్ని అమలు చేస్తోందన్నారు. జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా కానుక, అమ్మబడి తదితర పథకాలతో ఎంతోమంది విద్యార్థులు బడిబాట పట్టారన్నారు. మనబడి నాడు – నేడు కింద ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ ధీటుగా తీర్చిదిద్దమన్నారు. జిల్లాలో జగనన్న విద్యా దీవెన కింద 88,055 మంది విద్యార్థులకు గాను అర్హులైన 78,631 మంది తల్లుల ఖాతాలలో రూ.51.99 కోట్లు జమ చేశామన్నారు. ఇందులో 21,501 మంది ఎస్ సి విద్యార్థులుకు రూ.15.27 కోట్లు, 2165 మంది ఎస్ టి విద్యార్థులకు రూ.1.09 కోట్లు, 41,136 మంది బిసి సంక్షేమం విద్యార్థులకు రూ.21.33 కోట్లు, 7133 మంది ఈబిసి విద్యార్థులు రూ.5.78 కోట్లు, 12,400 మంది కాపు విద్యార్థులు రూ.6.30 కోట్లు, 3491 మంది ముస్లిం మైనారిటీ విద్యార్థులు రూ.2.07 కోట్లు, 229 మంది క్రిస్టియన్ మైనారిటీ విద్యార్థులు రూ.0.15 కోట్లు లబ్ది పొందారన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ప్రతి పేద విద్యార్థి ఉన్నత చదువే సీఎం లక్ష్యం –
జెడ్పీ ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, కర్నూలు నగర మేయర్ బి.వై రామయ్య :-
చదువుకోవాలనే పట్టుదల ఉండి ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువుకోలేని ప్రతి పేద విద్యార్థి ఉన్నతంగా చదువుకోవాలి అన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష్యమని జెడ్పీ ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, కర్నూలు నగర మేయర్ బి.వై రామయ్యలు పేర్కొన్నారు. రాష్ట్రంలో అనగారిన వర్గాలకు చెందిన నిరుపేద పిల్లలకు ఉన్నత విద్యను అందించి, ఉన్నత ఉద్యోగాలు సాధించేలా సమాజంలో అత్యున్నత స్థానానికి చేరుకునేందుకు వీలుగా జగనన్న విద్యా దీవెన పథకాన్ని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టారన్నారు. పేద విద్యార్థుల పాలిట మేనమామగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నిలిచారన్నారు.
మెగా చెక్కు విడుదల :-
ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లాలో జగనన్న విద్యా దీవెన కింద అక్టోబర్ – డిసెంబర్, 2021 త్రైమాసికానికి సంబంధించి 88,055 మంది విద్యార్థులకు గాను అర్హులైన 78,631 మంది తల్లుల ఖాతాలలో రూ.51.99 కోట్ల మెగా చెక్కును విద్యార్థుల తల్లులకు అందజేశారు.