
వివిధ కేసులలో ఉత్తమ ప్రతిభ కనబరచిన స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ ఖాజా
జిల్లా ఎస్పీ చేతుల మీదుగా ప్రశంస పత్రాన్ని అందుకున్న ఖాజా
జిల్లా ఎస్పీ చేతుల మీదుగా ప్రశంస పత్రాన్ని అందుకున్న స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ ఖాజా, హెడ్ కానిస్టేబుల్ జీనస్, కానిస్టేబుల్ మురళీధర్
స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ ఖాజా, హెడ్ కానిస్టేబుల్ జీనస్, కానిస్టేబుల్ మురళీధర్ లను అభినందించిన జిల్లా ఎస్పీ
కర్నూలు క్రైమ్ జనవరి 22, (సీమకిరణం న్యూస్):
కర్నూలులోని 4వ పట్టణ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ ఖాజా, హెడ్ కానిస్టేబుల్ జీనస్, కానిస్టేబుల్ మురళీధర్ లకు వివిధ కేసుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచినందున కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ వారిని అభినందించి రివార్డుతో పాటు ప్రశంస పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖ గౌరవం మరింత పెంచేలా గట్టిగా పని చేయాలన్నారు. నేరస్తులను గుర్తించేందుకు సాంకేతికతను వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమం అనంతరం వారు 4వ పట్టణ సీఐ విక్రమ సింహా కలిశారు. వారిని సీఐ అభినందించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ఎల్లప్పుడు గుర్తింపు లభిస్తుందని ఉత్తమ ప్రతిభ కనబరిచి జిల్లా ఎస్పీ చేతుల మీదుగా ప్రశంస పత్రాలను అందుకోవడం ఆనందదాయకమని 4వ పట్టణ సీఐ విక్రమ సింహా అన్నారు.




