మంచి నీటి చలివేంద్రం ప్రారంభం

పొట్టి శ్రీ రాములు జయంతి సందర్భంగా వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మంచి నీటి చలివేంద్రం ప్రారంభం
పిడుగురాళ్ళ, మార్చి 16, (సీమకిరణం న్యూస్) :
అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా వాసవి క్లబ్ పిడుగురాళ్ల ఆధ్వర్యంలో శ్రీ షిరిడి సాయి బాబా గుడి బజార్ లో మినరల్ వాటర్ మంచి నీటి చలివేంద్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిడుగురాళ్ల మునిసిపల్ చైర్మన్ కొత్త వెంకట సుబ్బారావు విచ్చేసి రిబ్బన్ కట్ చేసి చలివేంద్రం ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ జిల్లా గవర్నర్ డా జులకంటి శ్రీనివాసరావు క్లబ్ ప్రెసిడెంట్ కాకుమాను రామారావు, పిడుగురాళ్ల మునిసిపల్ వైస్ చైర్మన్ కొమ్ము ముక్కంటి, కౌన్సిలర్ కత్తెరపు వాసుదేవా రెడ్డి, వాసవి క్లబ్స్ జిల్లా క్యాబినెట్ ట్రేజరర్ జులకంటి సుబ్రహ్మణ్యం, క్లబ్ సెక్రెటరీ ఆరవపల్లి పూర్ణచంద్రరావు, క్లబ్ కోశాధికారి మణి, మద్దు నరేష్, గంగా, మరియు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.