“జగనన్న విద్యా దీవెన” ఉన్నత విద్యకు ఆలంబన
★ అందుకోండి విద్యా దీవెనలు :-
★ “జగనన్న విద్యా దీవెన” ఉన్నత విద్యకు ఆలంబన :-
★ పేద విద్యార్థులు ఉన్నత విద్యను కొనసాగించుటకై ఆర్థిక భరోసా ఇచ్చి ప్రోత్సహించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం :
★ పేదరికం కారణంగా ఏ ఒక్క విద్యార్థి చదువుకు దూరం కాకూడదన్నదే జగనన్న లక్ష్యం :-
★ విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు :
★ విద్యార్థుల దగ్గర సరస్వతి ఉంటే ధనలక్ష్మిని జగనన్న అందిస్తారంటున్న పేదలు :-
★ జిల్లాలో జగనన్న విద్యా దీవెన కింద అక్టోబర్ – డిసెంబర్, 2021 త్రైమాసికానికి సంబంధించి 88,055 మంది విద్యార్థులకు గాను అర్హులైన 78,631 మంది తల్లుల ఖాతాలలో రూ.51.99 కోట్లు జమ చేసిన రాష్ట్ర ప్రభుత్వం :-
కర్నూలు కలెక్టరేట్, మార్చి 16, ( సీమకిరణం న్యూస్) :
అందరూ చదవాలి…అందరూ ఎదగాలి అన్న నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థలో పలు మార్పులు తీసుకొస్తుంది. దీనికి తోడు పేద విద్యార్థులకు చేయూత నివ్వడానికి పలు పథకాలు అమలు చేస్తోంది. సంక్షేమ పథకాల క్యాలెండర్‌ను ముందుగానే ప్రకటించి కోవిడ్ కల్లోలంలోనూ దాన్ని తూచా తప్పకుండా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. నిరుపేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో దేశంలో ఎక్కడా లేని విధంగా అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి సకాలంలో, బకాయిలు లేకుండా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తున్నారు. ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికమే ఆ పిల్లల తల్లులకే చెల్లించి, వారే కాలేజీలకు ఫీజులు కట్టేలా చేసి పేదల ఇంట విద్యా జ్యోతులు వెలిగిస్తున్నారు. కర్నూలు జిల్లాలో 88,055 మంది విద్యార్థులకు గాను అర్హులైన 78,631 మంది తల్లుల ఖాతాలలో రూ.51.99 కోట్ల జమ అయ్యింది. దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ ఆర్ విద్యార్థులకు ఫీజు రీయంబర్స్ మెంట్ పథకాన్ని పెట్టి వారి ఉన్నత చదువులకు భరోసా కల్పిస్తే, వారి తనయుడు సి ఎం జగన్ ఫీజు రీయంబర్స్మెంట్ తో పాటు విద్యా దీవెన, వసతి దీవెనలు పెట్టి విద్యార్థుల ఉన్నత చదువులకు ఆర్థిక భరోసా అందిస్తుండడంపై పేద విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
జీవితకాలం రుణపడి ఉంటాం :-
బండి ఆత్మకూరు మండలం, వెంగల్ రెడ్డి పేటకు చెందిన విద్యార్థి తల్లి నాగలక్ష్మి…. నా కుమార్తె మౌనిక నంద్యాలలోని రామకృష్ణ డిగ్రీ కాలేజీలో మూడవ సంవత్సరం చదువుతుంది. ఆస్తులు ఇవాళ ఉంటాయి. రేపు పోతాయి, కానీ చదువులయితే ఎక్కడ ఉన్నా బాగా బతకగలరు, నా కూతురు నంద్యాల రామకృష్ణ డిగ్రీ కాలేజీలో మూడో ఏడాది చదువుతుంది, గతంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ వచ్చేది కాదు, ఫీజులు కట్టడానికి చాలా ఇబ్బంది పడేదానిని. జగనన్న సీఎం అయిన తర్వాత ఫుల్ ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తున్నారు, పైగా తల్లుల ఖాతాలో వేయడం చాలా సంతోషం. మేం నేరుగా కాలేజీలకు వెళ్ళి వాళ్ళ బాగోగులు తెలుసుకుంటున్నాం. మా పిల్లలకు అన్నీ అందుతున్నాయి, మా పిల్లల భాద్యత మీరే తీసుకుని చదివిస్తున్నారు. కోవిడ్ సమయంలో చాలా ఇబ్బందులు పడ్డాం, కానీ మీరు చేసిన సాయం వల్ల మాకు ఇబ్బంది లేకుండా జరిగింది. మీరు చేస్తున్న సేవలకు జీవితకాలం రుణపడి ఉంటాను. పేదరికంతో ఎవరు చదువు నిలిపివేయి కూడదన్న ముఖ్యమంత్రి ఆశయం చాలా గొప్పది. మా జీవితాలలో మరిన్ని వెలుగులు నింపాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. – విద్యార్థిని మౌనిక తల్లి నాగలక్ష్మి, బండి ఆత్మకూరు మండలం, వెంగల్ రెడ్డి పేట, కర్నూలు జిల్లా.
విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు :-
నా పేరు సుస్మిత, అమ్మ పేరు వరలక్ష్మి నంద్యాల పట్టణంలో నివసిస్తున్నాము. నంద్యాల పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ కాలేజీ లో థర్డ్ ఇయర్ బి జెడ్ సి చదువుతున్నాను. జగన్ మామయ్య మా చదువుల కోసం ఆర్థిక సహకారం అందించడం చాలా సంతోషంగా ఉంది. బాగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించి తల్లిదండ్రులను బాగా చూసుకుంటాను. జగనన్న అమ్మబడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా కానుక, మనబడి నాడు-నేడు విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి విద్యా రంగానికి జగనన్న పెద్దపీట వేస్తున్నారు. – తల్లి వరలక్ష్మీతో విద్యార్థిని సుస్మిత నంద్యాల రామకృష్ణ డిగ్రీ కాలేజ్ మూడవ సంవత్సరం, కర్నూలు జిల్లా.
మా చదువుల కోసం జగన్ మామయ్య ఎక్కువగా ఆలోచిస్తున్నారు :-
నా పేరు బి.సౌమ్యశ్రీ అమ్మ పేరు జయశ్రీ మాది నంద్యాల పట్టణం. నేను కర్నూలు నగరంలోని జగన్నాథ గట్టు సమీపంలో గల త్రిబుల్ ఐటీ థర్డ్ ఇయర్ చదువుతున్నాను. ఫీజు రియంబర్స్మెంట్ కింద 27 వేల రూపాయలు మా తల్లి ఖాతాలో జమ అయ్యాయి. వసతి దీవెన పథకం కింద పదివేల రూపాయలు జమ అయింది. నిరుపేద విద్యార్థులు పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో దేశంలో ఎక్కడా లేని విధంగా అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి సకాలంలో, బకాయిలు లేకుండా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తున్నారు. ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికమే ఆ పిల్లల తల్లులకే చెల్లించి, వారే కాలేజీలకు ఫీజులు కట్టేలా చేసి పేదల ఇంట విద్యా జ్యోతులు వెలిగిస్తున్నారు. మా చదువులపై ఎక్కువగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నారు.-బి.సౌమ్యశ్రీ థర్డ్ ఇయర్ త్రిబుల్ ఐటీ, కర్నూలు నగరం, కర్నూలు జిల్లా.
చాలా చాలా సంతోషంగా ఉంది….ధ్యాంక్యూ జగన్ మామయ్య :-
నా పేరు యశస్వి, అమ్మ పేరు జోష్ణ ప్రదీషా కర్నూలు నగరంలోని షరీఫ్ నగర్ లో నివసిస్తున్నాము. నేను అబ్దుల్ హక్ కర్నూలు ఉర్దూ యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ సోషల్ వర్క్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాను. డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గారు విద్యార్ధుల కోసం స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీఇంబర్స్‌మెంట్‌లు ఇచ్చి పేద, మద్యతరగతి కుటుంబాలలో వెలుగులు నింపారు. అలాగే తండ్రి ఆశయాలతో ఆయన తనయుడిగా మీరు విద్యాదీవెన, వసతి దీవెన వంటి పథకాలు ప్రవేశపెట్టారు, వీటి వల్ల నాలాంటి విద్యార్ధులు ఎందరో చదువుకుంటున్నారు. నిజంగా మీరు మాకు దేవుడిచ్చిన మామయ్యగా భావిస్తున్నాం. చదువుకోవాలన్న పట్టుదల ఉండి డబ్బుల్లేక వాళ్ళ ఆశలు వారే నాశనం చేసుకుంటున్న టైంలో మీరు ఇలాంటి పథకాలు పెట్టి మలాంటి పెద విద్యార్థుల జీవితాలలో వెలుగులు నింపుతున్నారు. చాలా చాలా సంతోషంగా ఉంది…ధ్యాంక్యూ జగన్ మామయ్య.-యశస్వి, అబ్దుల్ హక్ కర్నూలు ఉర్దూ యూనివర్సిటీ మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ సోషల్ వర్క్ ద్వితీయ సంవత్సరం, కర్నూలు జిల్లా.