ANDHRABREAKING NEWSPOLITICSSTATEWORLD

అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం ఎనలేనిది  

అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం ఎనలేనిది  

ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు పొట్టి శ్రీరాములు చేసిన కృషి చిరస్మరణీయం
కర్నూలు నగర పాలక మేయర్ రామయ్య , కర్నూలు నగర పాలక కమిషనర్ డి.కె.బాలాజీ

కర్నూలు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఘనంగా పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు

కర్నూలు కలెక్టరేట్, మార్చి 16, ( సీమకిరణం న్యూస్) :

అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా బుధవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో కర్నూలు నగర మేయర్ బి.వై. రామయ్య , కర్నూలు నగర పాలక కమిషనర్ డి.కె.బాలాజీ , డిప్యూటీ మేయర్ సిద్దారెడ్డి రేణుక, స్థానిక కార్పొరేటర్ సోంపల్లి కృష్ణకాంత్ రెడ్డి , మేనేజర్ చిన్న రాముడు , ఎస్.ఈ. సురేంద్ర బాబు , కో ఆప్షన్ మెంబర్ కృష్ణమూర్తి తో కలిసి అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి  పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కర్నూలు నగర పాలక మేయర్ రామయ్య , కర్నూలు నగర పాలక కమిషనర్ డి.కె.బాలాజీ మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం ఎనలేనిది, ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు పొట్టి శ్రీరాములు చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం తెలుగు ప్రజలు ఒక రాష్ట్రంగా ఉండాలని ఆంధ్ర రాష్ట్ర సాధనకు 58 రోజులు ఆమరణ నిరాహార దీక్షతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సాధించిన మహానుభావులు పొట్టి శ్రీరాములు అన్నారు. ఆయన చేసిన త్యాగం, పోరాటం నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు.

Seema Kiranam

SEEMA KIRANAM TELUGU DAILY NEWS...RNI REGISTRATION NUMBER...RNI : APTEL/2018/76380.... S.K. NAZEER.FOUNDER , EDITOR & PUBLISHER.SK PUBLICATIONS & MEDIA BROADCASTING INDIA PVT LTD.SEEMA KIRANAM TELUGU DIGITAL | KURNOOL | SK DIGITAL MEDIA |Telugu News | Latest News Online | Political News in Telugu | AndhraPradesh Latest News | AP Political News | Telangana News | TelanganaPolitics News | Crime News | Sports News |

Related Articles

Back to top button
error: Content is protected !!