ANDHRABREAKING NEWSSTATEWORLD
యూనియన్ సభ్యునికి ఆర్థిక చేయూత
నవ్యాంధ్ర ఎడిటర్స్ అండ్ జర్నలిస్ట్స్ యూనియన్ సభ్యునికి ఆర్థిక చేయూత
తిరుపతి , మార్చి 16, (సీమకిరణం న్యూస్) :
నవ్యాంధ్ర ఎడిటర్స్ & జర్నలిస్ట్స్ యూనియన్ సభ్యుడు జగదీష్ కు నాయకులు ఆర్థిక సహాయం అందించారు. తిరుపతి యూత్ హాస్టల్ లో బుధవారం జరిగిన రాష్ట్ర కమిటీ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో జగదీష్ కు రూ 10 వేలు సహాయం అందించారు. అనారోగ్యంతో బాధపడుతున్న జగదీష్ కు మరింత సహకారం అందిస్తామని నవ్యాంధ్ర ఎడిటర్స్& జర్నలిస్ట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష,కార్యదర్శులు సి.సూరిబాబు,యస్.మస్తాన్ వలి తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు అన్వర్ భాష, నన్నూరు శ్రీనివాసరావు, యస్. మహబూబ్ సుభాని లోకనాధం నాగార్జున, చంద్ర రాజు, సుకుమార్ కరీం బేగ్ తదితరులు పాల్గొన్నారు.