ANDHRABREAKING NEWSSTATETELANGANAWORLD
కోరికలు తీరాలంటే కోక కట్టాల్సిందే…!
కోరికలు తీరాలంటే కోక కట్టాల్సిందే…!
కర్నూలు ప్రతినిధి మార్చి 18 (సీమకిరణం న్యూస్) :
కోరికలు తీరాలంటే కోక కట్టాల్సిందేనని, అదెక్కడా అనుకుంటున్నారా..? కర్నూలు జిల్లా, ఆదోని మండల పరిధిలోని సంతేకూడ్లూరు. హోలీ పండుగ వేడుకలను పురస్కరించుకొని వింత ఆచారం కొనసాగుతుంది. శుక్రవారం రెండో రోజు మగవారు ఆడవారి వేషధారణలో వింత ఆచారం తో రతీమన్మదుల ను కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈవేడుకను వీక్షించేందుకు కర్ణాటక,తెలంగాణ ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి రతీమన్మదుల దర్శించుకుంటున్నారు.కోక కడితేనే కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. గత కొన్నేళ్లుగా వింత ఆచారం కొనసాగుతూ వస్తోంది. చిన్న పెద్ద, కుల మత భేదం లేకుండా కలిసికట్టుగా ఐకమత్యంతో వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. హోలీ వేడుకలకు ఆలయ సభ్యులు,గ్రామ పెద్దలు భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు.