థాయిలాండ్ కరెన్సీ ను సేకరించిన కరెన్సీ ప్రియుడు వాయిజ్
నెల్లూరు, ఆత్మకూరు, ఏఎస్ పేట, మార్చి 18, (సీమకిరణం న్యూస్) :
ఏఎస్ పేట మండలం అనుమసముద్రం గ్రామానికి చెందిన కరెన్సీ ప్రియుడు వాయిజ్ మరో దేశపు విలువైన కరెన్సీ ను సేకరించారు. థాయిలాండ్ దేశపు రాజు జన్మదినం సందర్భంగా ఆ దేశం లో నూతనంగా విడుదల చేసిన కటింగ్ చేయకుండా ఒకే నోటు లాగా వచ్చే 1,5,10 బాత్ (ఆ దేశపు కరెన్సీ పేరు బాత్) కటింగ్ లేని కరెన్సీని ను ఎలక్ట్రిషన్ అయినటువంటి కరెన్సీ ప్రియుడు మొహమ్మద్. వాయిజ్ సేకరించారు. ఈ మూడు నోట్ల ను ఆన్లైన్ బుకింగ్ లో సేకరించడానికి 700 రూపాయలు పోస్టల్ ఖర్చులు అయినట్టు వాయిజ్ శుక్రవారం విలేకరులతో నిర్వహించిన ప్రదర్శన కార్యక్రమంలో తెలిపారు. పురాతన తరాలకు చెందిన విలువైన కరెన్సీని నాణాలను ఈ తరం వారికి చూపించేందుకు వాయిజ్ చేస్తున్న కృషి అభినందనీయం. వీరి కృషికి ఏఎస్ పేట మండల కేంద్రంలో ఓ మ్యూజియంను ఏర్పాటు చేస్తే భవిష్యత్ తరాలకు ఉపయోగకరంగా ఉంటుందని స్థానికుల అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు.