విద్యుత్ షాక్‌తో లారీ డ్రైవర్ మృతి..

విద్యుత్ షాక్‌తో లారీ డ్రైవర్ మృతి..
కడియపులంక, మార్చి 19, ( సీమకిరణం న్యూస్) :
విద్యుత్ షాక్‌తో లారీ డ్రైవర్ మృతి చెందిన సంఘటన కడియం మండలం కడియపులంకలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే ఆ గ్రామం కాలువగట్టు(వీరవరం రోడ్డు) వద్ద ఓ నర్సరీకి ఎర్ర గ్రావెల్‌ను టిప్పర్ లారీ తీసుకువచ్చింది.గ్రావెల్ అన్‌లోడ్ చేస్తుంటే 11 కె.వి వైరు తగిలి లారీ మొత్తం విద్యుత్ ప్రవహించింది. దీంతో ధవలేశ్వరం క్వారీ కాలనీకి చెందిన దొండపాటి వీరబాబు(27) అనే డ్రైవర్ అక్కడే మృతి చెందాడు. కొద్ది నెలల క్రితమే వివాహం చేసుకున్న వీరబాబు మరికొద్ది రోజుల్లో తండ్రి కాబోతున్నాననే ఆనందంలో ఉన్నాడు.ఇంతలో విధి విద్యుత్ రూపంలో వెంటాడి మృతి చెందాడు. ఆకస్మికంగా మృతి చెందడంతో వీరబాబు బంధుమిత్రులు కన్నీరు మున్నీరుగా రోదిస్తున్నారు. ఇన్స్పెక్టర్ డి.రాంబాబు ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి కడియం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.