జనసేన పార్టీ కార్యాలయంలో హోలీ పండుగ వేడుకలు
..రంగులు చల్లుకొని సంబరాలు చేసుకున్న కార్యకర్తలు
ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగ హోలీ
జనసేన పార్టీ రాయలసీమ విభాగం కోఆర్డినేటర్ ఎస్ ఎం డి హసీనా బేగం
కర్నూలు జిల్లాలో హోలీ పండుగను కులమతాలకతీతంగా జరుపుకుంటారని హిందువులు ముస్లిములు క్రైస్తవులు సోదరభావంతో ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుని ఈ పండుగను ఐకమత్యంగా జరుపుకుంటారని జనసేన పార్టీ రాయలసీమ విభాగం కోఆర్డినేటర్ ఎస్ ఎన్ డి హసీనా బేగం అన్నారు. జనసేన పార్టీ కార్యాలయంలో మహిళా కార్యకర్తలు ఒకరు రంగులు చల్లుకుని సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ
హోలీ అనేది రంగుల పండుగ అని హిందువుల వసంత కాలంలో వచ్చే ఈ పండుగను భారత దేశంలోనే కాకుండా, నేపాల్, బంగ్లాదేశ్, ప్రవాస భారతీయులు కూడా ఎంతో ఘనంగా జరుపుకుంటారు అని పేర్కొన్నారు. భారత దేశంలోని పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌లలో దీన్ని దోల్‌యాత్రా దోల్ జాత్రా లేదా బసంత-ఉత్సబ్ వసంతోత్సవ పండుగ అని ఆమె పేర్కొన్నారు. అంతేకాకుండా హోలీ పండుగను దుల్‌హేతి, ధులండి, ధులెండి అని కూడా ఆ ప్రాంత ప్రజలు పిలుస్తారని అన్నారు. ముఖ్యమైన రోజు హోలీ ఉత్సవ రోజున, ప్రజలు రంగుల పొడిని, రంగు నీళ్ళను ఒకరిపై ఒకరు జల్లుకుంటూ ఘనంగా జరుపుకుంటారు అన్నారు. హోలీ ముందురోజున హిరణ్యకశ్యపుని చెల్లెలైన హోలిక అనే రాక్షసి బొమ్మకు నిప్పంటిస్తారు అని అన్నారు. దీనిని హోలిక దహన్ హోలికను కాల్చడం లేదా చోటీ హోలీ చిన్న హోలీ అని కూడా ప్రాంతాలనుబట్టి అంటారని అన్నారు. హిరణ్యకశిపుని చెల్లెలైన హోలిక అనే రాక్షసి ప్రహ్లాదుడిని మంటలలో వేసినప్పుడు దైవలీలతో తప్పించుకుంటాడు అని అందుకే భోగి మంటలు అంటిస్తారు అని పేర్కొన్నారు. హోలిక ఈ మంటలలో దహనమయ్యింది కానీ విష్ణువుకు పరమ భక్తుడైన ప్రహ్లాదుడు, అతని అపార భక్తితో ఎటువంటి గాయాలు లేకుండా తప్పించుకుంటాడు అని ఆమె పేర్కొన్నారు. ఆంధ్ర ప్రదేశ్లో హోలిక దహన్‌ను కామ దహనం అని అంటారు అని అన్నారు. ఈ వేడుకలో మేరీ, మున్ని , సోనాలిక, ఆయేషా , లక్ష్మీదేవి, పైసల్ పాల్గొన్నారు