
పవన్ కల్యాణ్ ను విమర్శించే స్థాయి సుభాష్ చంద్రబోస్ కు లేదు
• వాల్మీకి ఉద్యమాన్ని అడ్డుపెట్టుకొని పదవి పొందినంత ఈజీ కాదు పార్టీ నడపటం
• వాల్మీకి రిజర్వేషన్స్ ఏమైందో మీ జగన్ రెడ్డిని అడుగు
• జనసేన పార్టీ రాష్ట్ర మహిళా సాధికారత చైర్మన్, ఎమ్మిగనూరు అసెంబ్లీ ఇంఛార్జ్ జవాజీ రేఖ
పార్టీ నడపటం వాల్మీకి ఉద్యమాన్ని అడ్డుపెట్టుకొని గ్రంధాలయ చైర్మన్ పదవి పొందినంత ఈజీ కాదని జనసేన పార్టీ రాష్ట్ర మహిళా సాధికారత చైర్మన్, ఎమ్మిగనూరు అసెంబ్లీ ఇంఛార్జ్ జవాజీ రేఖ అన్నారు. స్థానిక కర్నూలు నగరంలోని రేఖ గారి క్యాంప్ కార్యాలయంలో జనసేన పార్టీ నాయకులతో కలిసి మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జవాజీ రేఖ మాట్లాడుతూ కర్నూలు జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ సుభాష్ చంద్రబోస్ కు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి లేదన్నారు. చిన్న పదవి కోసం వాల్మీకి రిజర్వేషన్ ఉద్యమాన్ని తాకట్టు పెట్టడం పై వాల్మీకులు ఆలోచిస్తున్నారని సమయం వచ్చినప్పుడు బుద్ధి చెబుతారని అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక హోదా తీసుక వస్తానన్న జగన్ మూడు సంవత్సారాలైన హోదా గురించి ఎక్కడైన మాట్లాడినారా అని ప్రశ్నించారు. సుభాష్ చంద్రబోస్ గారు మీకు చిత్త శుద్ధి ఉంటే జిల్లాలో ఉన్న గ్రంధాలయ అభివృద్ధికి మీ జగన్ రెడ్డితో నిధులు తెప్పించి అభివృద్ధి చేయండన్నారు. దాతల సహకారంతో జిల్లా గ్రంథాలయానికి గేట్లు, అభివృద్ధికి సహకారం తీసుకుంటున్నారంటే మీ ప్రభుత్వానికి గ్రంధాలయ అభివృద్ధి పై ఉన్న శ్రద్ధ అర్థం అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పాల్గోన్నారు.