సిపిఎస్ రద్దు చేయాలంటూ యుటిఎఫ్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ
సిపిఎస్ రద్దు చేయాలంటూ యుటిఎఫ్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ
నెల్లూరు, ఆత్మకూరు, ఏఎస్ పేట, మార్చి17, (సీమకిరణం న్యూస్) :
యుటిఎఫ్ రాష్ట్ర సంఘం ఇచ్చిన పిలుపు మేరకు సిపిఎస్ రద్దు చేయాలని కోరుచూ ఏఎస్ పేట మండల కేంద్రం లోని స్థానిక ఎం ఈ ఓ కార్యాయం నుంచి దర్గా సెంటర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ముఖ్యమంత్రి పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ ను అమలు చేయాలని నినదించారు. ముఖ్యమంత్రి పాదయాత్రలో ఇచ్చిన హామీ అమలు చేసేంతవరకు యు టి ఎఫ్ పారాడుతుందని ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్, సిపిఎస్ రద్దయ్యే వరకు నిరసన కార్యక్రమాలు చేస్తుందని యుటిఎఫ్ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా కోశాధికారి ఎ.మురళీధర్ రావు, ఎఎస్ పేట మండల అధ్యక్షులు వి. మల్లికార్జున రావు, ప్రధాన కార్యదర్శి సయ్యద్ ఖాజా రహంతుల్లా, గౌరవ అధ్యక్షులు షేక్ జిలాని పాషా, జిల్లా కౌన్సిలర్ సుబ్బయ్య, అసోసియేట్ అధ్యక్షురాలు కె ఉమా, సీనియర్ ఉపాధ్యాయులు ఎద్దలయ్య,నాయబ్, ఫయాజ్ అలీ ఇతర ముఖ్య నాయకులు ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఎలాంటి ఘటనలు జరగకుండా స్థానిక ఎస్ఐ షేక్ సుభాని ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.