మధ్యాహ్న భోజన పథకాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
‘జగనన్న గోరుముద్ద’ మధ్యాహ్న భోజన పథక పనితీరును పరిశీలించిన జిల్లా కలెక్టర్
జగనన్న గోరుముద్ద కార్యక్రమం అమలు వాటి తీరు తనిఖీల్లో భాగంగా శనివారం కల్లూరు మండలంలోని చిన్నటేకూరు గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జగనన్న గోరుముద్ద మధ్యాహ్న భోజన పథకం పనితీరును కర్నూలు జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా కలెక్టర్ విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించారు. మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం పనితీరును పాఠ్యాంశాలపై పలు విషయాలను విద్యార్థులను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. పాఠశాల విద్యా కమిటీ సభ్యులకు, ఉపాధ్యాయులకు, భోజనం వండి పెడుతున్న మహిళలకు జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వరరావుపలు సూచనలు పలు సూచనలు జారీ చేశారు. ఈ తనిఖీల్లో జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు తో పాటు డీఈవో రంగారెడ్డి, ఎంఈఓ శ్రీనివాసులు, కల్లూరు మండల తహసిల్దార్ రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.