దర్వేష్ ఖాద్రి ఉరుసు మహోత్సవంలో పాల్గొన్న జనసేన పార్టీ నాయకులు
దర్వేష్ ఖాద్రి ఉరుసు మహోత్సవంలో పాల్గొన్న జనసేన పార్టీ నాయకులు
…. దర్గా పై చాదర్ వేసి మొక్కులు తీర్చుకున్న నాయకులు
కర్నూలు టౌన్, మార్చి 19, (సీమకిరణం న్యూస్) :
కర్నూలు జిల్లా గడివేముల మండలం గని గ్రామంలో వెలిసిన హజ్రత్ దర్వేష్ ఖాద్రి ఉరుసు మహోత్సవం వేడుకలలో జనసేన పార్టీ నాయకులు బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి, నక్కల మిట్ట శ్రీనివాసులు, మహబూబ్ బాషా, రాయలసీమ విభాగం వీర మహిళా కోఆర్డినేటర్ ఎస్ యమ్ డి హసీనా బేగం, డాక్టర్ హుస్సేన్ హాజరయ్యారు. దర్గా లో ఫాతిహా ఇప్పించి దర్గా పై చదర్ వేసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దర్గా పై గులాబీ పూలు వేసి దువా చేశారు. దర్గా ఉరుసు మహోత్సవానికి ప్రతి సంవత్సరం వేలాదిగా ప్రజలు పాల్గొని మొక్కులు తీర్చుకుంటారు అని ఈ సందర్భంగా వారు తెలిపారు. ప్రతి సంవత్సరం దర్గాను దర్శించి ప్రత్యేకంగా ప్రార్థనలు చేసే సంప్రదాయం వస్తుందని మహబూబ్ బాషా అన్నారు. ఇందులో భాగంగానే ఈ ఏడాది కూడా కుటుంబ సమేతంగా దర్గాకు వచ్చామని అన్నారు. ఈ ఏడాది ప్రజలు సుభిక్షంగా ఉండేలా దర్వేష్ ఖాద్రి బాబా దీవించాలని అన్నారు. గడివేముల మండలం నుంచే కాకుండా పలు ప్రాంతాల నుంచి ఈ దర్గాను సందర్శించేందుకు భక్తులు వస్తారని ఆయన తెలిపారు. ఏడాది పంటలు కూడా సుభిక్షంగా పండుగలా బాబా దీవించాలని అన్నారు. రైతుల ఇంట సిరుల పంట పండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాశీం మియా, రాజేష్, జనసేన పార్టీ వీర మహిళలు మేరీ, మున్ని, సోనాలిక పాల్గొన్నారు.