చెత్త పన్ను వసూళ్లు తప్పని సరి
చెత్త పన్ను వసూళ్లు తప్పని సరి
చెత్త పన్ను వసూళ్లు నిలిపి వేయాల్సిందే
మేయర్ పోడియంను చుట్టు ముట్టిన టిడిపి సభ్యులు
అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వివాదం
కర్నూలు సిటీ, మార్చి 19, (సీమకిరణం న్యూస్) :
ప్రజల నుంచి చెత్త పన్ను వసూలు చేయక పోతే మున్సిపాల్టీలకు రావా ల్సిన 15వ ఆర్థిక సంఘం నిధు లు కేంద్ర ప్రభుత్వం ఇవ్వదని మేయర్ బి ఎల్లా రామయ్య వివరణ ఇచ్చారు. రూ.219 కోట్ల 61 లక్షల 13 వేలుగా రూపొందించిన బడ్జెట్ ను శనివారం జరిగిన నగర పాలక సంస్థ బడ్జెట్ (ప్రత్యేక) సర్వ సభ్య సమావేశంలో ప్రవేశ పెట్టగా పాలకవర్గం అమోదిం చింది.ఉదయం బడ్జెట్ సమావేశం జరగగా మధ్యా హ్నం తర్వాత సాధారణ సమావేశం జరిగింది.ముందుగా రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి మరణాన్ని చింతిస్తూ రెండు నిమిషాలు సభ మౌనం పాటించింది.నగర మేయర్ బి.వై. రామయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశాలకు కర్నూలు, పాణ్యం, కోడుమూరు ఎమ్మెల్యేలు ఎం.ఏ. హఫీజ్ ఖాన్ , కాటసాని రాంభూపాల్ రెడ్డి , జరదొడ్డి సుధాకర్ హాజరయ్యారు. బడ్జెట్లో రాబడి 220 కోట్ల 17 లక్షల 83 వేలుగా చూపించారు.ఖర్చులు 219 కోట్ల 61 లక్షల 13 వేలుగా చూపించారు.నికర మిగులుగా 56 లక్షల 70 వేలు చూపించారు.అలాగే క్యాపిటల్ రాబడి 77 కోట్ల 79 లక్షల 51 వేలుగా, రెవెన్యూ మిగులు 12 కోట్ల 67 లక్షల 19 వేలుగా, క్యాపిటల్ ఖర్చులు 89 కోట్ల 90 లక్షల 19 వేలుగా, క్యాపిటల్ మిగులు 56 లక్షల 70 వేలుగా చూపించారు.అదే విధంగా రెవెన్యూ ఆదాయం 142 కోట్ల 38 లక్షల 32 వేలుగా, ఖర్చులు 129 కోట్ల 71 లక్షల 13 వేలుగా, నికర మిగులు 12 కోట్ల 67 లక్షల 19 వేలుగా చూపించారు.అనంతరం జరిగిన నగర పాలక సంస్థ సర్వసభ్య సాధారణ సమావేశంలో ఆమోదించిన 16 తీర్మానాల్లో. స్వచ్చ భారత్ లో భాగంగా స్వచ్చ సర్వేక్షన్ – 2022 పోటిలలో నగర పాలక సంస్థ పాల్గొంటునందున నగరంలో బహిరంగ మలవిసర్జన రహిత మరియు గార్బేజ్ ఫ్రీ ల్నగరంగా కర్నూలు ప్రకటించారు.కర్నూల్ నగర పాలక సంస్థ స్వచ్ఛ సర్వేక్షన్ లో భాగంగా చెత్త నగర రహితంగా తీర్చిదిడడేందుకు ఇంటింటికి డస్ట్ బిన్ లు పంపిణీ చేస్తున్నామని మేయర్ తెలిపారు. డస్ట్ బిన్ లు పంపిణీ చేయకుండా టిడిపి వార్డుల్లో వివక్ష చూపిస్తున్నారని టిడిపి ఫ్లోర్ లీడర్,వార్డు కార్పొరేటర్ మౌనిక రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజకీయాలకతీతంగా అభివృద్ధి జరగాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సూచించారని, ఆ మేరకు అన్ని వార్డులను సమదృష్టితో చూస్తున్నామని ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ వివరించారు. వైసీపీ ప్రభుత్వం లో ఇంటి పన్ను చెత్త పన్ను,ఇసుక పాలసీ ప్రజలకు ఇబ్బందిగా మారిందని, కొత్తగా డ్రైనేజీ ,రోడ్డు,ఇల్లు ఏ ఒక్కటీ చేపట్టిన దాఖలాలు లేవని టీడీపీ కార్పొరేటర్ పరమేష్ ద్వజమెత్తారు. అజెండాలో లేని అంశాలను కౌన్సిల్ లో ఎందుకు మాట్లాడుతున్నారంటూ అధికార పార్టీ కార్పొరేటర్లు టీడీపీ కార్పొరేటర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కౌన్సిల్లో గందరగోళం తలెత్తింది.చెత్త పన్ను వసూలు నిలిపివేయాలంటూ టిడిపి సభ్యులు మేయర్ పోడియం వద్దకు వెళ్లి నిరసనకు దిగారు. పార్టీ సభ్యులు కూడా మేయర్ పోడియం వద్దకు వచ్చి ప్రభుత్వానికి అనుకూలంగా నినాదాలు చేశారు. దీంతో అధికార ప్రతిపక్ష వార్డు కార్పొరేటర్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కౌన్సిల్ సమావేశాన్ని సాధారణ స్థితికి తెచ్చేందుకు మేయర్ బీ వై రామయ్య 10 నిమిషాలు సమావేశాన్ని వాయిదా వేశారు. రెండో అంశంగా నగర పాలక సంస్థ పరిధిలో ఉన్న మామిదలపాడు, మునగాలపాడు, స్టాంటన్ పురం గ్రామ పంచాయితీల్లో ముగ్గురు సెక్రటరీ గ్రేడ్ - 1 ఉద్యోగులను పర్యవేక్షలుగా పోస్టులు రూపకల్పన చేసి నగరపాలక సంస్థ లో తీసుకుంతిన్నామని ప్రతిపాదన చేయగా అధికార పార్టీకి చెందిన సభ్యులు ఇది వాయిదా వేయాలని సూచించగా ఈ సంస్థ ఉద్యోగుల కు పదోన్నతుల విషయంలో ఎలాంటి నష్టం లేదని మేయర్ వివరణ ఇచ్చారు.మామిదాల పాడు లో కొత్తగా నిర్మించనున్న.సమ్మర్ స్టోరేజ్ నిర్మాణంలో దళితుల భూములు కోల్పోతున్నారని వారిని అన్ని విధాల ఆదుకోవాలని కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ కోరారు. వరద వరద ముంపు లో పాసుబుక్కులు ,పట్టాలు పోయావని ఇప్పటికిప్పుడు ఆధారాలు చూపాలంటే సాధ్యం కాదని దీనిపై పూర్తి స్థాయి కమిటీ వేసి విచారణ విచారణ జరిపించి తగిన న్యాయం చేయాలన్నారు. మేయర్ స్పందిస్తూ దీనిపై పూర్తి స్థాయిలో కమిటీ వేసి చర్చించిన అనంతరం పూర్తిస్థాయి సర్వే జరిపించి భూములు కోల్పోయిన లబ్ధిదారులు అందరికీ సరైన న్యాయం చేస్తామన్నారు. ఎమ్మెల్యే కాటసాని మాట్లాడుతూ కల్లూర్ అర్బన్ ప్రాంతాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా మారిందని యుద్ధ ప్రాతిపదికన సమ్మర్ స్టోరేజ్ పనులు చేపట్టి తాగు నీరు అందించాలని సూచించారు. తొలి ప్రాధాన్యతగా తాగునీటి సరఫరా అంశాన్ని తీసుకున్నామని,మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు మేయర్ వివరించారు.