చెత్త పన్ను రద్దు చేయాలి
చెత్త పన్ను రద్దు చేయాలంటూ తెలుగుదేశం పార్టీ కార్పోరేటర్ల నిరసన
కర్నూలు టౌన్, మార్చి 19, (సీమకిరణం న్యూస్):
కర్నూలు మున్సిపాలిటీలో చెత్త పన్ను రద్దు చేయాలంటూ తెలుగుదేశం పార్టీ కార్పోరేటర్లు గళం పెంచారు. శనివారం నగర పాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన మున్సిపల్ కౌన్సి ల్ సమావేశంలో తెలుగుదేశం పార్టీ కార్పోరేటర్లు అబ్దుల్ లతీఫ్, పరమేష్, షేక్ జకియా అక్సారీ, శివమ్మ, విజయ కుమారి, రవణమ్మ, మాణిక్య మ్మ, మౌనిక రెడ్డి, బొల్లెద్దుల విజయ ప్రత్యూష పాల్గొన్నారు. సభ ప్రారంభం అవ్వగానేమాట్లా డిన తెలుగుదేశం కార్పోరేటర్లు చెత్త పన్ను విధానంపై నిల దీశారు. చెత్త పన్ను విధించడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చెత్త పన్ను కట్టకపోతే మున్సిపాలిటీ అధికారులు, సిబ్బంది ప్రజలను భయ భ్రాం తులకు గురిచేస్తున్నారన్నారు. పలు చోట్ల ఇళ్లు ఖాలీ చేయా లని చెబుతున్నారని మండి పడ్డారు. సామాన్య ప్రజలకు భారమైన చెత్త పన్ను విధానా న్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మేయర్ పోడియం వద్ద నిరసన తెలిపారు. అనంతరం కౌన్సిల్ సమావేశాన్ని వాకౌట్ చేసి బయటకు వచ్చారు.