ANDHRABREAKING NEWSPOLITICSSTATEWORLD
టిడిపి గెలిస్తేనే ప్రజా సమస్యలకు పరిష్కారం…
టిడిపి గెలిస్తేనే ప్రజా సమస్యలకు పరిష్కారం…
టిడిపి నేతలు
కర్నూలు టౌన్, మార్చి 19, (సీమకిరణం న్యూస్):
తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే ప్రజల సమస్యలు తీరుతాయని టిడిపి నేతలు అన్నారు. నగరంలోని 49వ వార్డు ఎన్.ఆర్ పేటలో టిడిపి గౌరవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యలపై చర్చించారు. మద్యపాన నిషేధం, చెత్తపై పన్ను, రేషన్ కార్డుల తొలగిపుపై చర్చించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఇబ్బందులు మాత్రమే మిగిలాయన్నారు. ఈ ప్రభుత్వంలో ప్రభుత్వ యంత్రాంగం సైతం జీతాల విషయంలో అవస్థలు పడుతున్నారన్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో 49వ వార్డు ఇంచార్జి విక్రమ్ సింగ్, టిడిపి నగర అధ్యక్షుడు గున్న మార్క్, హనుమంత రెడ్డి, నాగేంద్ర సింగ్, రవి ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.