లక్ష్య సాధన కోసమే ఎన్జీవోలు –
లక్ష్య సాధన కోసమే ఎన్జీవోలు –
నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ సంపత్ కుమార్
అనంతపురం కలెక్టరేట్, మార్చి 21, ( సీమకిరణం న్యూస్) :
రాజ్యాంగ పరిరక్షణ లో భాగంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పీడిత బాధిత ప్రజలకు అండగా ఉండేందుకు ఒక లక్ష్యంతో ఏర్పాటు కాబడిన సంస్థ నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సంస్థ అని నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ చైర్మన్ సంపత్ కుమార్ అన్నారు. గత రెండు సంవత్సరాలుగా బాధితులకు అండగా నిలుస్తూ ఎన్నో సమస్యలను పరిష్కరిస్తూ బాధితులు, అధికారుల నుంచి మన్నలు పొందుతూ అంచెలంచెలుగా ఎదుగుతూ ముందుకు సాగుతున్న సంస్థ నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అని ఆయన అన్నారు. సంస్థలు అనేవి లక్ష్యం కోసం ప్రజా ప్రయోజనాల కోసం రాజ్యాంగ పరిరక్షణ కోసం ఏర్పడతాయని సంస్థల సభ్యులు కొందరు వ్యక్తిగత ప్రయోజనాల కోసం పొరపాట్లు చేయొచ్చు కానీ సంస్థలు ఎటువంటి పొరపాట్లు చేయవని ఆయన తెలియజేశారు. వ్యక్తుల పొరపాట్లను సంస్థల పొరపాటుగా చూడవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. సంస్థలు అనేవి స్వలాభాపేక్ష కోసం ఏర్పాటు చేసినవి కావు సంస్థ సభ్యుడు చేసే నేరాలను సంస్థపై ఆపాదించడం దురదృష్టకరమని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సభ్యులు దానికి భిన్నంగా నడుచుకోవడం మా సంస్థ చేసుకున్న అదృష్టమని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఎన్ హెచ్ ఆర్ సి లోనికి ఉన్నతమైన వ్యక్తులు, ఉన్నత భావాలు కలిగిన వ్యక్తులు సేవా దృక్పథం తో పని చేయాలనే తపనతో, బాధితులకు అండగా ఉండాలని దీక్షతో మా సంస్థ లోనికి రావడం సంస్థ యొక్క గొప్పతనం అని ఆయన తెలిపారు. సమస్యలు ఎన్ని వచ్చినా సహనంతో ఓర్పుతో న్యాయస్థానాల సహాయ సహకారాలతో ముందుకు సాగాలని సభ్యులకు ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వ రంగ సంస్థలు ఎన్ హెచ్ ఆర్ సి కి అండగా నిలుస్తాయని ఆయన ఆశించారు. మానవ హక్కుల అవగాహన లోనూ, మానవ హక్కులను రక్షించడం లోనూ న్యాయాన్ని కాపాడడం లోను సంస్థతో ప్రభుత్వ రంగ అధికారులు కలిసి రావాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు వి.వి రామకృష్ణ రెడ్డి, నేషనల్ కన్వీనర్ బి. లీలా ప్రసాద్, నేషనల్ ఉపాధ్యక్షుడు బండి పరమేశ్వరరావు,రాష్ట్ర ఉపాధ్యక్షుడు శంకర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి బల్ల సుధాకర్ నాయుడు, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఎం.బీ మహేష్ బాబు,జిల్లా అధ్యక్షుడు ముక్తియార్ , జిల్లా మహిళా అధ్యక్షురాలు అనిత గారు, జిల్లా కార్యదర్శి రామ్మోహన్, జిల్లా ఉపాధ్యక్షుడు ఇలియాజ్
కె. పి.రాజు, తదితరులు పాల్గొన్నారు.