BREAKING NEWSTELANGANA
మండలి చైర్మన్ గుత్తా ను సన్మానిస్తున్న నాయకులు

మండలి చైర్మన్ గుత్తా ను సన్మానిస్తున్న నాయకులు
చిట్యాల, మార్చి 21, ( సీమకిరణం న్యూస్) :
ఇటీవల వరుసగా రెండవసారి శాసనమండలి చైర్మన్ గా ఎన్నికైన గుత్తా సుఖేందర్ రెడ్డి సోమవారం తన స్వగ్రామమైన చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామానికి తొలిసారిగా విచ్చేసిన సందర్భంగా తెరాస గ్రామశాఖ అధ్యక్షులు ఉయ్యాల నాగరాజు గౌడ్ ఆధ్వర్యంలో గుత్తాను శాలువాలతో సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామశాఖ ప్రధానకార్యదర్శి దోటి భిక్షం, ఉపాధ్యక్షుడు ఎండీ బషీర్, వార్డు సభ్యులు సాగర్ల వెంకన్న, యూత్ అధ్యక్షులు కొత్త లింగస్వామి, సీనియర్ నాయకులు పోలగోని స్వామి, ఉయ్యాల నరేష్, రూపని యాదయ్య, జనపాల శ్రీను, మర్రి రమేష్, ఉయ్యాల నర్సింహా, సుంకరి అశోక్, అవిశెట్టి మల్లేష్, పాలకూరి సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.