మంచి ఉన్నత స్ధాయికి ఎదగాలి : జిల్లా ఎస్పీ
మంచి ఉన్నత స్ధాయికి ఎదగాలి
జిల్లా ఎస్పీ సిహెచ్. సుధీర్ కుమార్ రెడ్డి
సైనిక్ పాఠశాలలకు ఎంపికయిన 15 మంది విద్యార్థులను అభినందించిన జిల్లా ఎస్పీ
కర్నూలు క్రైమ్ , మార్చి 21, ( సీమకిరణం న్యూస్) :
మంచి ఉన్నత స్ధాయికి ఎదగాలని జిల్లా ఎస్పీ సిహెచ్. సుధీర్ కుమార్ రెడ్డి ఐపియస్ పేర్కొన్నారు. సోమవారం కొత్తపేట దగ్గర ఉన్న స్పందన భవనంలో కర్నూలు జిల్లా నుండి చిత్తూరు, విజయనగరం సైనిక పాఠశాలలకు ఎంపికయిన మొత్తం 15 మంది విద్యార్దులను జిల్లా ఎస్పీ సిహెచ్. సుధీర్ కుమార్ రెడ్డి ఐపియస్ అభినందించారు. కర్నూలు జిల్లా నుండి 14 మంది 6 వ తరగతి ప్రవేశానికి చిత్తూరు కలికిరి సైనిక పాఠశాలకు ఎంపికయ్యారు.
ఇందులో …
జయశ్రీ, చౌదీప్ రెడ్డి, గగన్ శ్రీతన్ రెడ్డి, అవినాష్ క్రిష్ణ, స్నేహిత్ రెడ్డి, నాగసాయి సిద్ధార్ధ, వైనిక సాయి, చరిస్మా, చంద్రవర్ధన, సాయి శౌర్య, కార్తీకేయన్, క్రిష్ణ కిశోర్ యాదవ్, నందకిశోర్, అశ్విన్ ఎంపికయ్యారు. 9 వ తరగతి ప్రవేశానికి విజయనగరం జిల్లాలోని కోరుకొండ సైనిక పాఠశాలకు కర్నూలు జిల్లా నుండి సాయి అభిరాం ఎంపికయ్యారు.
సైనిక పాఠశాలలో ఎంపిక కావడానికి శిక్షణ ఇచ్చిన కర్నూలు , ఎస్ హెచ్ ఎస్ సైనిక్ స్కూల్ కోచింగ్ సెంటర్ వారిని, విద్యార్ధుల తల్లిదండ్రులను జిల్లా ఎస్పీ అభినందించారు. మంచి ఉన్నత స్ధాయికి ఎదగాలని విద్యార్ధులకు జిల్లా ఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు ఎస్ హెచ్ ఎస్ సైనిక్ స్కూల్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ హారి, విద్యార్దుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.