
కర్నూలు నగరంలోని కొత్తపేట దగ్గర ఉన్న స్పందన కార్యాలయంలో జిల్లా ఎస్పీ సిహెచ్. సుధీర్ కుమార్ రెడ్డి ఐపియస్ సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించారు. స్పందన కార్యక్రమానికి ఈ రోజు మొత్తం ఇప్పటివరకు 134 ఫిర్యాదులు వచ్చాయి. స్పందనకు వచ్చిన ప్రజల సమస్యల వినతులను స్వీకరించి ఫిర్యాది దారులతో మాట్లాడారు. వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని ….
1) LUKAMAI (మిని బ్యాంకు) కంపెనీ అనే డిజిటల్ మొబైల్ వాలెట్ యాప్ పేరుతో AEPS ఆధార్ కార్డుల ద్వారా LUKAMAI టెక్నాలజీ కంపెనిలో చేర్చుకుంటామని చెప్పి, ఐడి కార్డులు, ఫింగర్ ప్రింట్ స్కానర్లు, ప్రింటర్ల కొరకు నిరుద్యోగుల నుండి డబ్బులు కట్టించుకుని మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కౌతాళం మండలంకు చెందిన 16 మంది బాధితులు ఫిర్యాదులు చేశారు.
2) ఓర్వకల్లు ఎయిర్ పోర్టులో సెక్యూరిటి గార్డు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు తీసుకొని మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఈ. తాండ్రపాడు చెందిన మాసుం భాషా, ఈశ్వరయ్య, గోపాల్ లు ఫిర్యాదు చేశారు.
3) బ్యాంకు ఆఫ్ బరోడా లో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి డబ్బులు తీసుకుని మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మిగనూరుకు చెందిన హామిద్ భాషా ఫిర్యాదు చేశారు.
4) నా ఇద్దరు కుమారులు అన్నం పెట్టకుండా బయటకు పంపించారని నా జీవన ఆధారం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని బనగాన పల్లెకు చెందిన నారాయణమ్మ ఫిర్యాదు చేశారు.
స్పందన కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి, ఫిర్యాదుదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఈ సంధర్భంగా జిల్లా ఎస్పీ హామీ ఇచ్చారు. ఈ స్పందన కార్యక్రమంలో డిఎస్పీలు రామాంజినాయక్, వెంకటాద్రి ఉన్నారు.