కమ్యూనిస్టు యోధురాలు మల్లు స్వరాజ్యం మృతి ఉద్యమాలకు తీరని లోటు
సిపిఎం కేంద్ర కమిటి సభ్యులు ఎం ఎ గపూర్
కమ్యూనిస్టు యోధురాలు మల్లు స్వరాజ్యం మృతి ఉద్యమాలకు తీరని లోటు
సిపిఎం కేంద్ర కమిటి సభ్యులు ఎం ఎ గపూర్
కర్నూలు క్రైమ్ , మార్చి 21, ( సీమకిరణం న్యూస్) :
తెలంగాణ రైతాంగ పోరాట యెదురాలు నైజాం నిరంకుశత్వానికి వ్యతిరేఖంగా పోరాడిన వీర వనిత కామ్రేడ్ మల్లు స్వరాజ్యం మృతి చెందడం కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటు అని సిపిఎం కేంద్ర కమిటి సభ్యులు ఎం ఎ గపూర్ అన్నారు, కె కె భవనంలో మల్లు స్వరాజ్యం సంతాప సభ కామ్రేడ్ బి రామాంజనేయులు అధ్యక్షతన జరిగింది. సంతాప సభలో పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఎం ఎ గపూర్, పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ మల్లు స్వరాజ్యం 1931 లో నల్గొండ జిల్లాలో భూస్వామ్య కుటుంబంలో జన్మించిన ఆమె చిన్నతనం నుండే ఉద్యమాల వైపు ఆకర్షితురాలై పని చేసింది, తెలంగాణలో నైజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పేదలకు అండగా గెరిల్లా పోరాటంలో పాల్గొన్నారు,పేదలకు భూములు పంచాలని వ్యవసాయ కూలీలతో కలిసి భూ పోరాటాలు చేశారు, మహిళల కోసం, మహిళల రక్షణ కోసం అనేక ఉద్యమాలు నిర్వహించారు, నల్లగొండ జిల్లా నుండి రెండు సార్లు ఎమ్మెల్యే గా పనిచేశారు, చివరివరకు పార్టీ ఉద్యమం కోసం పని చేసిన నిజమైన విరవణిత కామ్రేడ్ మల్లు స్వరాజ్యం అన్నారు, మాజిల్లాలో కూడా జరిగిన భూపోరాటల్లో, మహిళ ఉద్యమ పోరాటాల్లో ఆమె పాల్గొన్నారని అన్నారు మల్లు స్వరాజ్యం ఎత్తిన జెండాను మన కడదాకా మోయాలని అదే నిజమైన నివాళి అన్నారు. సంతాప సభ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు పి నిర్మల మాట్లాడారు, పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె వి నారాయణ, జి రామకృష్ణ, కె వెంకటేసులు, సిటీ కార్యదర్సులు ఎం రాజశేఖర్, టి రాముడు, జిల్లా కమిటీ సభ్యులు ఎం డి ఆనంద్ బాబు, పుల్లారెడ్డి, విజయ్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు .