ఎమ్మిగనూరు పట్టణంలో కుక్కల వీరంగం
కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన బాలుడు
ఎమ్మిగనూరు, మార్చి 21, ( సీమకిరణం న్యూస్) :
పట్టణంలో కుక్కలు వీరంగం సృష్టిస్తుండటంతో పట్టణ ప్రజలు బెంబేలెత్తుతున్నారు.ఇంటినుండి కాలు బయటకు పెట్టాలంటే ఎక్కడ కుక్కలు వచ్చి కరుస్తాయోనని భయపడిపోతున్నారు. ఆదివారం పట్టణంలోని చున్నబట్టి వీధిలో పాఠశాల నుండి ఇంటికి వెళ్లే మార్గాన నలుగురు బాలురులను శునకాలు ఒక్కసారిగా నలుగురు బాలురులపై దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిదంగా హెచ్.బి.ఎస్ కాలనీ, గాంధీనగర్, ఎస్.ఎం.టి కాలనీ, ఎంబి చర్చ్, మునెప్పనగర్, కొండవీటి ప్రాంతం తదితర కాలనీల్లో కుక్కలు గుంపులుగా తిరుగుతూ అటు ఇటు తిరిగే వ్యక్తులపై దాడులు చేస్తున్న సంఘటనలు అనేకంగా ఉన్నాయి. నేడు చున్నం బట్టి వీధిలో కుక్కలు దాడిలో గాయపడిన బాలురులను ప్రభుత్వ ఆసుపత్రి కి తీసుకుని వెళ్లగా సరైన మందులు లేవని కేవలం టిటి ఇంజెక్షన్ ఇచ్చి కర్నూలుకు వెళ్ళమని చెప్పారు. కుక్కల దాడి విషయంపై మున్సిపల్ అధికారులకు అనేక మార్లు విన్నవించినా పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికయినా అధికారులు తక్షణమే స్పందించి కుక్కలు పట్టేవిధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.లేదంటే ఆందోళన చేపడతామని తెలిపారు.