ఏపీ డబ్ల్యూ జె ఎఫ్ బలోపేతానికి కృషి చేద్దాం
ఏపీ డబ్ల్యూ జే ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి టి. మద్దిలేటి
ఏపీ డబ్ల్యూ జె ఎఫ్ బలోపేతానికి కృషి చేద్దాం
ఏపీ డబ్ల్యూ జే ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి టి. మద్దిలేటి.
నంద్యాల, మార్చి 21, ( సీమకిరణం న్యూస్) :
ఎపిడబ్ల్యుజెఎఫ్ జర్నలిస్టుల సంఘాన్ని ఒక మహా శక్తిగా మార్చాల్సిన అవసరం ఉందని నియోజకవర్గం లో జర్నలిస్టులను కలుపుకొని సంఘం బలోపేతానికి ప్రతి నాయకుడు, కార్యకర్త కృషి చేయాలని ఎపిడబ్ల్యుజెఎఫ్ రాష్ట్ర కార్యదర్శి టి.మద్దిలేటి పేర్కొన్నారు. నంద్యాల పట్టణంలోని శ్రీ రామకృష్ణ కళాశాలలో నంద్యాల నియోజకవర్గ స్థాయి ఎపిడబ్ల్యుజెఎఫ్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు .ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర నాయకులు మద్దిలేటి మౌలాలి సీనియర్ జర్నలిస్ట్, జిల్లా ఉపాధ్యక్షులు మాదాల శ్రీనివాసులు బనగానపల్లె ఎపిడబ్ల్యూ జె ఎఫ్ ఇంచార్జ్, జిల్లా ఉపాధ్యక్షులు మద్దయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా గళం విప్పడానికి ఎపిడబ్ల్యుజెఎఫ్ ఎల్లప్పుడూ ముందు ఉంటుందన్నారు.జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని పేర్కొన్నారు. ప్రధానంగా జర్నలిస్టుల అభివృద్ధి కోసం సంక్షేమ నిధి ,ప్రతి జర్నలిస్టుకు ఇంటి స్థలం విద్య వైద్య రంగాలలో రాయితీలు ఉద్యోగ భద్రత రక్షణకు కృషి చేస్తుందని తెలిపారు.యూనియన్ అభివృద్ధి చెందడానికి యూనియన్ లోని ప్రతి సభ్యుడు అందుకు అనుగుణంగా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విప్లవ మహిళ, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యంతో పాటు ఇటీవల మృతి చెందిన జర్నలిస్టులు జెమిని మధు విశాలాంధ్ర నారాయణస్వామి v5 కేశవ త్రిబుల్ వన్ శివ కుమార్ మృతికి సంతాపం పాటించారు. అనంతరం ఏకగ్రీవంగా నూతన కమిటీని ఎన్నుకున్నారు . నంద్యాల నియోజకవర్గం ఎపిడబ్ల్యుజెఎఫ్ గౌరవ అధ్యక్షులుగా మాదాల శ్రీనివాసులు సలహాదారుగా రమణయ్య అధ్యక్షుడిగా కాకర్ల శివ ప్రధాన కార్యదర్శిగా జగన్ కోశాధికారి మస్తాన్ ఉపాధ్యక్షుడుగా జాషువా సాయిరాం సుబ్బయ్య సహాయ కార్యదర్శులు మజీద్ సల్మారాజు, రాజునాయక్ ఇక్బాల్, శ్రీనివాసులును ఎన్నుకున్నారు. 25 మంది ఈ సి నెంబర్లతో కమిటీఏర్పాటు చేశారు .ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ నంద్యాల నియోజకవర్గంలో పనిచేసే విలేకరుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని ,నంద్యాల పట్టణంలో ప్రెస్ క్లబ్ ఏర్పాటు కు మిగతా యూనియన్ లతో కలిసి కృషి చేస్తామనీ పేర్కొన్నారు.