అలసత్వం వద్దు – బాధ్యతా యుతంగా వ్యవహరించండి
నగర మేయర్ బి. ఎల్లా రామయ్య
అలసత్వం వద్దు – బాధ్యతా యుతంగా వ్యవహరించండి
నగర మేయర్ బి. ఎల్లా రామయ్య
కర్నూలు టౌన్ , మార్చి 21, ( సీమకిరణం న్యూస్) :
విధుల పట్ల అలసత్వం వహించవద్దని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని నగర మేయర్ బి. ఎల్లా రామయ్య సచివాలయం అడ్మిన్ లకు సూచించారు. సోమవారం సాయంత్రం మేయర్ క్యాంపు కార్యాలయంలో 19వ వార్డులోని సచివాలయ అడ్మిన్ లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సచివాలయాల వారీగా జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆరా తీశారు.పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఇంకా చేపట్టాల్సిన పనులు ఆరా తీశారు. ప్రజలకు ఎటువంటి సేవలు అందిస్తున్నారు, ఇప్పటి వరకు ప్రజలతో ఎలా వ్యవహరించారని కనుక్కున్నారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది ప్రజలతో మంచిగా వ్యవహరించి, సమస్య పరిష్కారం కాని పక్షంలో పరిధిలో లేనప్పుడు వారికి సున్నితంగా సమాధానాలు ఇవ్వాలన్నారు. సమావేశంలో జోనల్ ఆఫిసర్ అబ్దుల్ వాజిద్, సానిటేషన్ ఇంస్పెక్టర్ రాజు, కార్పొరేటర్ లక్మ్షి రెడ్డి, వార్డు నాయకులు బెల్లం మహేశ్వర్ రెడ్డి, గోపాల్ రెడ్డి, శివరాం, తిరుపాలు, శ్రీను, చిన్న తదితరులు పాల్గొన్నారు.