ANDHRABREAKING NEWSSTATEWORLD
నీటి కొళాయిల ఏర్పాటు

నీటి కొళాయిల ఏర్పాటు
నంద్యాల, మార్చి 21, ( సీమకిరణం న్యూస్) :
పట్టణ శివారులోని మూల మఠం దగ్గర తాగునీటి వసతి లేకపోవడంతో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి దృష్టికి స్థానిక కౌన్సిలర్ పురం దరు కుమార్ సమస్యను వివరించారు. దీంతో ఇటీవల పైప్ లైన్ పనులను పూర్తి చేశారు. నీటి కొళాయి కోసం పైప్ లైన్ వేసి నేడు కొళాయిలు బిగించి నీటి సరఫరాను మున్సిపల్ చైర్ పర్సన్ మాబున్నిసా, వార్డు కౌన్సిలర్ పురందర్ కుమార్, మున్సిపల్ అధికారులు చేపట్టారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ పురందర్ కుమార్ మాట్లాడుతూ వార్డుల్లోని సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వెళ్లిన వెంటనే పరిష్కరించడం జరిగిందని, వార్డు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు.