నూతన థియేటర్ ప్రారంభం
నూతన థియేటర్ ను ప్రారంభిస్తున్నయాజమాన్యం, వైసీపీ నాయకులు

నూతన థియేటర్ ప్రారంభం
నూతన థియేటర్ ను ప్రారంభిస్తున్నయాజమాన్యం, వైసీపీ నాయకులు
కోసిగి, మార్చి 21, ( సీమకిరణం న్యూస్) :
స్థానిక రంగప్ప గట్టు బెళగల్ రోడ్డులో నూతనంగా నిర్మించిన సినిమా హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమం సోమవారం ఘనంగా ఆయా హీరో ల అభిమానుల మధ్య ఘనంగా చేశారు. ముఖ్య అతిథిగా వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన నాయకులు ప్రదీప్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వంలో చలన చిత్ర పరిశ్రమకు పెద్దపీట వేశారన్నారు. మన రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత చలనచిత్ర పరిశ్రమ కుంటుపడిందని , జగనన్న ప్రభుత్వంలో సినిమా రంగంకు ఎన్నోరకాల రాయితీలు కల్పిస్తూ,మన రాష్ట్రంలో సినీ రంగానికి, సినిమా థియేటర్ల యాజమాన్యాల కు అన్ని విధాల రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సైతం రిలీజ్ రోజున సినిమాలు ప్రదర్శిస్తుండటం చాలా శుభపరిణామమని, అందరూ సినిమా హాళ్ళు వచ్చి,మంచి ఎంటర్టైన్మెంట్ పొంది,చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పాటు పడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఈరన్న,మండల కన్వీనర్ బెట్టన గౌడ్, మహాం తేష్ స్వామి, నాడిగేని నాగ రాజు, మంగమ్మ,మణిక్యా రాజు, థియేటర్ యాజమాన్యం రాఘవేంద్ర రెడ్డి , మంజునాథ్ , గోవిందు , శ్రీనివాసులు , కల్లప్ప తదితరులు పాల్గొన్నారు.




