అరటి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
అరటి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
మహానంది , మార్చి 21, ( సీమకిరణం న్యూస్) :
గత ఆదివారం సంభవించిన గాలి బీభత్సం వల్ల అరటి రైతుల పాలిట శాపంగా మారిందిని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి జి సోమన్న సిపిఐ మండల కార్యదర్శి సామెల్ అన్నారు. మండలపరిధిలోని గాజులపల్లి, అబ్బిపురం, తిమ్మాపురం, శ్రీనగర్ ప్రాంతాలలోని అరటి పొలాల్లో పర్యటించి రైతులతో మాట్లాడడం జరిగింది.
అరటి రైతులు ఎకరానికి లక్షలు పెట్టుబడి కౌలు రైతులు అదనంగా లక్షన్నర పెట్టుబడి ఖర్చులు వస్తున్నాయని వాపో తున్నారన్నారు. గాలిబిత్సవం తో సుమారు 200 ఎకరాల లో అరటి రైతులు పూర్తిగా నష్టపోవాల్సి జరిగిందన్నారు. వీటి అంచనా ప్రకారం రూ.4.50 కోట్ల అరటి పంట నష్టం వాటిల్లిందని రైతులు వాపోయారు.
ప్రభుత్వం అరటి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల రైతు నాయకులు రాముడు, శ్రీను, వెంకటేశ్వర్ రెడ్డి,బి సుబ్బారెడ్డి, బాలకృష్ణ,గొల్ల మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు.