రామవరం లో పులి సంచారం.
భయాందోళనలకు గురవుతున్న ప్రజలు
అవుకు, మార్చి 24, ( సీమకిరణం న్యూస్) :
మండలం లోని రామవరం గ్రామం పరిసర ప్రాంతాలోని కొండల్లో పులి సంచరిస్తుండడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నట్లు పేర్కొంటున్నారు. గత నాలుగు రోజులుగా పులి కొండ ప్రాంతాల్లో ఎస్ఆర్బిసి కాలువ పరిసర ప్రాంతాలలో gnss కాల్వపై సంచరిస్తుండడంతో పులిని చూసిన కొందరు వ్యక్తులు గ్రామంలోని ప్రజలకు సమాచారాన్ని గతంలో కూడా కొండ ప్రాంతాల్లో పులి సంచరించేదని పందుల కోసం ఏర్పాటుచేసిన ఉచ్చులో పులి చిక్కుకోవడం తో అప్పుడు అటవీశాఖ అధికారులు స్పందించి పులి ని బంధించి జూకు తరలించారు. మరలా ఇప్పుడు పులి సంచరిస్తుండడంతో పనులకు వెళ్లాలంటేనే రైతులు వ్యవసాయ కూలీలు జంకుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అధికారులు స్పందించి వెంటనే పులి యొక్క జాడను కనుగొని పులిని బంధించి దూర ప్రాంతాలకు తరలించాలని గ్రామ ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు.