ఆకస్మికంగా 26వ వార్డు సచివాలయ తనిఖీ :-
ఆకస్మికంగా 26వ వార్డు సచివాలయ తనిఖీ :-
ప్రజలకు జాప్యం లేకుండా ప్రభుత్వ సేవలను పారదర్శకంగా అందించండి :-
సచివాలయ సిబ్బందిని ఆదేశించిన జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు :-
కర్నూలు కలెక్టరేట్, మార్చి 23, (సీమకిరణం న్యూస్) :-
సమస్యలపై ప్రజలు సమర్పించే దరఖాస్తులపై వెంటనే స్పందించి ప్రజలకు అత్యుత్తమ సేవలందించేందుకు సచివాలయ సిబ్బంది, వలంటీర్లు కృషిచేయాలని జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు అన్నారు. బుధవారం సాయంత్రం ఆదోని పట్టణంలోని వెంకన్నపేట 26వ వార్డు సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఆదోని ఆర్డీఓ రామకృష్ణారెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఆర్జీవి కృష్ణ తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు. వార్డు పరిధిలో ప్రభుత్వ సేవల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి త్వరితంగా సేవలందించాలన్నారు. ప్రభుత్వ సేవలు సులభతరంగా అందించే దిశగా సిబ్బంది పనిచేయాలన్నారు. ప్రజలకు జాప్యం లేకుండా ప్రభుత్వ సేవలను పారదర్శకంగా అందించాలని సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. ప్రజలకు అవసరమైన అన్ని రకాల సేవలను ఇంటి వద్దనే అందించేందుకు సచివాలయ వ్యవస్థ అనేది చాలా కీలకమన్నారు. సచివాలయ ఉద్యోగులు అంతా సక్రమంగా విధులు నిర్వహించాలన్నారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజల అందరికీ అవగాహన కల్పించాలన్నారు. అనంతరం సచివాలయంలో సిబ్బంది హాజరు పట్టిక, ఉద్యోగుల మూవ్మెంట్ రిజిస్టర్, సంక్షేమ పథకాల క్యాలెండర్, ఎస్ఎల్ఏ గడువులోగా ప్రజా సమస్యల పరిష్కార చర్యల నివేదిక తదితర వాటిని జిల్లా కలెక్టర్ పరిశీలించారు.