ANDHRA
26న కోసిగి పంచాయతీ వేలం పాటలు
ఈ నెల 26 న కోసిగి పంచాయతీ వేలం పాటలు
కోసిగి, మార్చి 23, (సీమకిరణం న్యూస్) :
ఈనెల 26వ తారీకు కోసిగి గ్రామ పంచాయతీ వేలంపాటలు నిర్వహిస్తున్నట్లు గ్రామ సర్పంచ్ కుమారిఅయ్యమ్మ , పంచాయతీ సెక్రెటరీ సత్యన్న లు తెలిపారు. బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న వారపు సంత , రహదారి రసుం ,చిన్న కమేళ , పెద్ద కమేళ ,లకు ఈ నెల26 న శనివారం ఉదయం 11 గంటలకు గ్రామపంచాయతీ కార్యాలయంలో వేలంపాట నిర్వహిస్తామన్నారు. వేలంపాట లో పాల్గొనే వారు ముందుగా డిపాజిట్ చెల్లించి వేలం పాట పాడాలని అన్నారు.నియమ నిబంధనల ప్రకారం వేలం పాటలు నిర్వహిస్తామన్నారు.కాగఇందులో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఎస్సై దనుంజయ ఆధ్వర్యంలో గట్టి పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిసింది.