భగత్ సింగ్ జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి
భగత్ సింగ్ జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి.
కోసిగి, మార్చి 23, (సీమకిరణం న్యూస్) :
స్థానిక కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో బుధవారం భగత్ సింగ్ 91వ వర్దంతి సందర్బంగా సంస్మరణ సభను ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యవర్గ సభ్యుడు రాజు ,తాలూకా అధ్యక్షుడు ఎస్,ఈరేష్ మండల కార్యదర్శి అంజి ఆద్వర్యంలో, కస్తూర్బా గాంధీ బాలికల ప్రిన్సిపల్ పుష్పలత అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
మన దేశానికి స్వాతంత్ర్యం తెచ్చేందుకు ఎందరో మహానుభావులు తమ జీవితాలను ప్రాణాలను సైతం అర్పించారనీ ,వీరిలో ఎప్పటికీ గుర్తుండిపోయే మహనీయులు భగత్ సింగ్ రాజ్ గురు సుఖ్ దేవ్ అన్నారు.భగత్ సింగ్ ఆయన పేరు వింటే యావత్ భారతీయుల రక్తం గర్వంతో ఉప్పొంగుతుందన్నారు. ఆయన ఆశయాలు, ఆలోచనలు, ఆవేశం ఎంతోమంది యువతలో స్ఫూర్తి నింపిందన్నారు.గొప్ప విప్లవకారుడిగా, స్వాతంత్య్ర సమరయోధుడిగా చరిత్రలో నిలిచిపోయే వీరుడు మన భగత్ సింగ్ అనీ ,భగత్ సింగ్ పంజాబ్‌లోని ఖత్కర్ కలాన్ అనే గ్రామంలో 1907, సెప్టెంబరు 28న జన్మించారు. ప్రస్తుతం ఈ ప్రాంతం పాకిస్తాన్‌లో ఉంది. చిన్న వయస్సులోనే దేశ స్వాతంత్ర్యం కోసం తెల్లదొరలతో పోరాడారన్నారు. 13 ఏళ్ల వయసులోనే సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నాడు. ఆయన అడుగుజాడల్లో నడిచి వారి ఆశయసాధనకు కృషి చేయాలన్నారు. రాజ్ గురు భగత్ సింగ్ సుఖ్ దేవ్ జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఐ.ధనుంజయ్ , గర్ల్స్ హై స్కూల్ హెచ్.ఎం నీలకంఠ , పల్లెపాడు హైస్కూలు హెచ్.ఎం సుధాకర్ , హెచ్.ఎం రాజమౌళి , బాయ్స్ హై స్కూల్ ఉపాధ్యాయుడు ఎర్రిస్వామి , అడివన్న , గంగాధర్ లు పాల్గొన్నారు.