శ్రీ మళ్లీ మస్తాన్ బాబు కు ఘన నివాళి
శ్రీ మళ్లీ మస్తాన్ బాబు కు ఘన నివాళి
ఆత్మకూరు, సంగం, మార్చి 23, (సీమకిరణం న్యూస్) :
నెల్లూరు జిల్లా ఆదివాసి బిడ్డ ,ఎన్నో ఎత్తైన పర్వతాలు అవ రోదించిన శ్రీ మళ్లీ మస్తాన్ బాబు ప్రతి ఒక్కరికి ఆదర్శమని నేషనల్,ట్రైబల్,ఫెడరేషన్,రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ,బి నాగేశ్వరరావు,నేషనల్ ,ట్రైబల్ ఫెడరేషన్,రాష్ట్ర ఆర్గనైజర్.సెక్రటరీ బైరి రెడ్డయ్య,ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.అనంతరం మళ్లీ మస్తాన్ బాబు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా మండల కేంద్రమైన సంఘం ముంబై రోడ్డు ,జాతీయ రహదారి పక్కన స్వర్గీయ ,శ్రీ మళ్లీ మస్తాన్ బాబు ఏడవ వర్ధంతి కార్యక్రమాన్ని,బుధవారం నిర్వహించారు.అనంతరం వారు మాట్లాడుతూ ప్రపంచ పర్వతారోహకుడు స్వర్గీయ శ్రీ మళ్లీ మస్తాన్ బాబు 7వ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా దాదాపు 200 మందికి,అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.మళ్లీ మస్తాన్ బాబు,నెల్లూరు జిల్లా వాసిగా,మంచి పేరు ప్రఖ్యాతలు,సాధించిన ధీరుడు ని కొనియాడారు.,172రోజుల్లో,7 ఖండాల లోని ఏడు పర్వతాలను,అధిరోహించి,గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కాడు అని తెలిపారు.ఎవరెస్టు పర్వతాన్ని ఎక్కిన మొట్టమొదటి తెలుగు,భారతీయుడు అని తెలిపారు.2006 సంవత్సరంలో ప్రపంచంలోని వివిధ దేశాలలోని ఏడు ఎత్తయిన దుర్లభమైన పర్వత శిఖరాలను 172 రోజుల అతి తక్కువ కాలంలో అధిరోహించిన భారతీయ పర్వతారోహకుడు గా గుర్తింపు పొందాడు అన్నారు.మళ్లీ మస్తాన్ బాబు మన మధ్య లేకపోవడం ఎంతో బాధాకరమైన విషయం అన్నారు.ఆయన బతికి ఉంటే ఎంతో మంది విద్యార్థులకు పర్వతాలు ఎక్కించే ట్రైనింగ్ క్లాసులు ఏర్పాటు చేసేవాడు అని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించిన సంగం మండల ఎంపిపి కే రఘునాథ్ రెడ్డి,కాకు మధు సుదన్ యాదవ్,కాకు మదన్ యాదవ్,యేసు,వెంకటస్వామి,తదితరులు పాల్గొన్నారు.