దేశ వ్యాప్త సమ్మె జయప్రదం చేయండి : కార్మిక సంఘాలు
దేశ వ్యాప్త సమ్మె జయప్రదం చేయండి : కార్మిక సంఘాలు
నెల్లూరు, ఆత్మకూరు, మార్చి 23, (సీమకిరణం న్యూస్) :
ఈనెల 28 29 తేదీలలో కార్మిక సంఘాలు తలపెట్టిన దేశవ్యాప్త సమ్మె లో భాగంగా కళాజాతను చేపట్టారు కళాజాత బుధవారం ఆత్మకూరు , సంగం, బుచ్చి మండలాల మీదుగా నెల్లూరు చేరుకుంటుంది ఆత్మకూరు అంబేద్కర్ విగ్రహం వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఏ ఐ టి యు సి జిల్లా ప్రధాన కార్యదర్శి దామా అంకయ్య సిఐటియు నాయకురాలు బేగం, ఐ ఎఫ్ టి యు నాయకులు మాట్లాడారు ఈ నెల 28, 29 తేదీలలో జరుగు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ప్రభుత్వ రంగ సంస్థల నమ్మకానికి వ్యతిరేకంగా, సమాన పనికి సమాన వేతనం ,రెగ్యులరైజేషన్, అసంఘటిత కార్మికుల సంక్షేమం కోరుతూ తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెలో ప్రజలు భాగస్వామ్యం కావాలని నెల్లూరు జిల్లాలోని ధర్మల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉపసంహరించుకోవాలని కార్మిక చట్టాలను కాల రాయడం మానుకోవాలని శ్రమ దోపిడీ అరికట్టాలని ప్రభుత్వ రంగ స్థలం సమస్యలను ధర్మస్థలం సంస్థలను కాపాడుకొనే దిశగా చేపట్టే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు శివయ్య ,డేవిడ్ రాజు, నాగయ్య, శేషాద్రి, మునీర్ బాబు ,నాగరాజు, హజరత్తయ్య , గుల్జార్ బేగం,శివ నాగ జ్యోతి ,పద్మ తదితరులు పాల్గొన్నారు.