భగత్ సింగ్ ఆశయాలను సాధించాలి : యుటిఎఫ్

భగత్ సింగ్ ఆశయాలను సాధించాలి : యుటిఎఫ్
ప్యాపిలి, మార్చి 23, (సీమకిరణం న్యూస్) :
భారతజాతిని దాస్య విముక్తి గావించడానికి,పరదేశీయులైన బ్రిటీష్ అధికార సేనలకు దీటైన సవాలు విసిరి,యువ పోరాట యోధుడై స్వాతంత్ర్య సమరంలో విప్లవాగ్నిని జ్వలింపజేసిన మేటి దేశభక్తుడు,విప్లవ చైతన్యానికి మారు పేరు,బ్రిటీషు వారిని క్షమాభిక్ష కోరక ఉరి కొయ్యల ఉగ్గు పాలు తాగిన అమరవీరుడు భగత్ సింగ్ అని,భగత్ సింగ్ ఆశయాలను సాధించాలని యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి నరసింహారెడ్డి పేర్కొన్నారు.ప్యాపిలి మండల పరిధిలోని ఏనుగు మర్రి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు పాఠశాల భోజన విరామ సమయంలో యుటిఎఫ్ జిల్లా కౌన్సిలర్ లోకేశ్వరి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ 23 సంవత్సరాల వయసులోనే స్వాతంత్ర్య కాంక్ష కలిగి బ్రిటీష్ వారిని ఎదిరించిన విప్లవ జ్యోతి భగత్ సింగ్ అని కొనియాడారు. అనంతరం భగత్ సింగ్ చిత్ర పటానికి పూల మాల వేసి ఘనమైన నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా కౌన్సిలర్ చంద్ర మోహన్, నాగాంజనేయులు, ఉపాధ్యాయులు సుమన్,జయ గోపాల్,మారతమ్మ,ఉమా,శివ,పాల్ దర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.