వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షునిగా కె. యం. సుభాన్ ఎంపిక
వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షునిగా కె. యం. సుభాన్ ఎంపిక
విజయవాడ/ కర్నూలు ప్రతినిధి, మార్చి 23, (సీమకిరణం న్యూస్) :
వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ సయ్యద్ ఖాసీం రసూల్ ఇల్యాస్ అధ్యక్షతన బుధవారం విజయవాడ బసవపున్నయ్య కళాక్షేత్రంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగినది. రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెల్ఫేర్ పార్టీ ప్రస్తుతం ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీ వర్గాల ప్రజలందరూ కలిసికట్టుగా పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు నడిపించాలని అన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద నిరుపేద మధ్యతరగతి కుటుంబీకులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలు రోజురోజుకు అతికష్టంగా బ్రతుకు బండిని నెట్టుకుంటూ వెళుతున్నారు. నిత్యావసర ధరలు డీజిల్ పెట్రోల్ గ్యాస్ సామాన్యునికి అందనంత ఎత్తులో ఉన్నాయి. రాబోయే ఎన్నికల్లో లౌకిక పార్టీగా పేదల అభివృద్ధే లక్ష్యంగా పని చేసేలా పార్టీని అందరూ కలిసి బలోపేతం చేయాలని ఆయన కోరారు. వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా యా రాష్ట్ర అధ్యక్షునిగా నెల్లూరు జిల్లాకు చెందిన కె ఎమ్ సుహాన్ ను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా కర్నూలు జిల్లాకు చెందిన జిఎం జఫరుల్లాను, రాష్ట్ర ఉపాధ్యక్షులు గా ఏలూరుకు చెందిన ఇస్మాయిల్ షరీఫ్, కార్యదర్శులుగా హసన్ షరీఫ్, సత్యనారాయణ, కోశాధికారిగా షేక్ మక్బూల్, రాష్ట్ర మహిళ కార్యదర్శిగా బనగానపల్లెకు చెందిన రమీజాబీ కార్యవర్గ సభ్యులుగా , 16 మంది సభ్యులను ఏకగ్రీవంగా ఎంపిక చేయడం జరిగింది. వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు కె ఎమ్ సుభాన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ప్రత్యామ్నాయ పార్టీ, విలువలతో కూడిన సాంస్కృతిక సమాఖ్య విధానాన్ని పోషక విలువలు కలిగిన ఆహారం, గౌరవప్రదమైన వస్త్రధారణ అనుకూల గృహవసతి, ఆరోగ్య భద్రత, ఉత్తమ విద్య, అందరికీ న్యాయం, ధన సంపాదనలో వికేంద్రీకరణ ప్రజాస్వామ్య బ్రహులత్వాల సాధనే ప్రధానలక్ష్యంగా పార్టీ పని చేసామని ఆయన తెలిపారు. వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా కాన్సెప్ట్ పేపర్ అమలు, సభ్యునికి యూనిట్ అవగాహన కల్పించడంతోపాటు మత మైనార్టీలు, దళిత, గిరిజన ప్రజాస్వామిక విధులను పునాదులుగా కలిగి పార్టీ పని చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హుస్సేన్ భాష, అబ్దుల్ సలాం, నవీద్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.